Crime News : ఇద్దరు ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి.. స్నేహితురాలిపై అత్యాచారం-2 trainee army officers beaten up robbed female friend raped in madhya pradesh indore ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : ఇద్దరు ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి.. స్నేహితురాలిపై అత్యాచారం

Crime News : ఇద్దరు ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి.. స్నేహితురాలిపై అత్యాచారం

Anand Sai HT Telugu
Sep 12, 2024 02:56 PM IST

Crime News : ఇద్దరు ట్రైనీ ఆర్మీ అధికారులపై దుండగులు దాడి చేశారు. అంతేకాదు వారితో వచ్చిన ఇద్దరు మహిళా స్నేహితురాల్లో ఒకరిపై అత్యాచారం కూడా జరిగింది. ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఇద్దరు ట్రైనీ ఆర్మీ అధికారులను కొట్టి, వారి మహిళా స్నేహితుల్లో ఒకరిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున బాద్గొండలో చోటుచేసుకుంది. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు.

ఇండోర్ రూరల్ ఎస్పీ హితికా వాసల్ మాట్లాడుతూ.. యువ ఆర్మీ అధికారులతోపాటుగా వారి ఇద్దరు మహిళా స్నేహితులపై దాడి చేసి లూటీ చేశారు. 'ఇద్దరు ట్రైనీ ఆర్మీ అధికారులను, వారి మహిళా స్నేహితులను కొట్టి దుండగులు దోపిడీ చేశారు. ఒక మహిళపై వేధింపులు, అత్యాచారం సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం.'అని ఎస్పీ తెలిపారు.

ట్రైనీ ఆర్మీ అధికారులు మహిళా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన్నట్టుగా తెలుస్తోంది. మోవ్ కంటోన్మెంట్ పట్టణంలోని ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో 23, 24 ఏళ్ల యువ ఆర్మీ అధికారులు శిక్షణ పొందుతున్నారు. ఛోటీ జామ్‌లోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో మహిళా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు మోవ్-మండలేశ్వర్ రోడ్డులోని పిక్నిక్ స్పాట్ దగ్గరకు ఎనిమిది నుండి పది మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కారులో కూర్చున్న అధికారులలో ఒకరిపై, మహిళలపై దాడి చేయడం ప్రారంభించారు. వారి వస్తువులను కూడా దుండగులు దోచుకున్నారు. నిందితులు ఇద్దరు మహిళలను బందీలుగా ఉంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు ఇచ్చేందుకు అంగీకరించడంతో విడిచిపెట్టారు.

ట్రైనీ ఆర్మీ అధికారి ఒకరు ఎలాగోలా ఈ సంఘటన గురించి తన సీనియర్‌లకు ఘటన స్థలం నుంచి తెలిపారు. ఆ తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని బాద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ అన్నారు. పోలీసులు రావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

ట్రైనీ ఆర్మీ అధికారులు, వారి మహిళా స్నేహితులను బుధవారం ఉదయం 6.30 గంటలకు వైద్య పరీక్షల కోసం మోవ్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల నివేదికలో ఓ మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.