Tiger terror: బాబోయ్ పులి.. ఏలూరులో పులి భయం..-a tiger attacking cattle in west godavari district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tiger Terror: బాబోయ్ పులి.. ఏలూరులో పులి భయం..

Tiger terror: బాబోయ్ పులి.. ఏలూరులో పులి భయం..

Sarath chandra.B HT Telugu
Jan 30, 2024 01:42 PM IST

Tiger terror: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను పెద్ద పులి భయపెడుతోంది. గత కొద్ద రోజులుగా పంట పొలాల్లో సంచరిస్తున్న పులి తాజాగా దూడల్ని పట్టుకుపోతోంది.

పులి భయంతో చెట్టెక్కిన రైతు
పులి భయంతో చెట్టెక్కిన రైతు

Tiger terror: ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. పులి సంచారంతో గ్రామాల్లో రైతులు, ప్రజలు ఆందోళన ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులుగా దెందులూరు, నల్లజర్ల ద్వారకాతిరుమల మండలాల్లో సంచరిస్తున్న పెద్దపులి అడపాదడపా పశువులపై దాడులు చేస్తోంది.

yearly horoscope entry point

తాజాగా మంగళవారం ఉదయం చల్ల చింతల పూడి లో పులిని చూసిన రైతులు బెంబేలెత్తి పోయారు. పోలవరం కుడికాల్వ వెంబడి గ్రామాల్లో పులి సంచారం గుర్తించిన అటవీ శాఖ అధికారులు దాని సంచరాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే పులిపాదముద్రలు సేకరించి 10 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులిని బంధించేందుకు బోన్‌ కూడా సిద్ధం చేశారు. మంగళవారం ఉదయం ద్వారకా తిరుమల మండలం రామ సింగవరం శివారులో దూడపై పెద్దపులి దాడి చేసింది.

దూడను చంపి సమీప అడవిలోకి లాక్కు వెళ్లడాన్ని రైతు గుర్తించాడు. పులి దాడి చయడాన్ని చూసిన రైతు భయంతో చెట్టెక్కిన స్థానిక రైతు గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో స్థానికులు పెద్ద సంఖ్యలో మామిడి తోటలోకి వచ్చారు. పులి సంచారంతో ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.

పెద్దపులి విషయంపై ఎలాంటి సమాచారం తెలిసినా టోల్ ఫ్రీ నెం. 1800-425-5909 తెలియచేయాలని సూచించారు. పులి కదలికలను నిరంతరం గమనించేందుకు అటవీశాఖ సిబ్బందిని బృందాలుగా నియమించినట్టు అటవీ అధికారులు తెలిపారు.

ఆదివారం పెదవేగి మండలం ముండూరుతో పాటు దెందులూరు మండలం మేదినవారిపాలెం గ్రామ సమీపంలో పులి సంచారాన్ని గుర్తించారు. దాదాపు 13ఏళ్ల పులిగా నిర్ధారించారు. పాపికొండల మీదుగా అభయారాణ్యం దాటుకుని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

పెద్దపులి కదలికలు గురించి సమీప గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంతువు గురించి ఎటువంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే అటవీ శాఖకు సంబంధించిన టోల్ ప్రీ నెంబరు.1800-425-5909 కు తెలియజేయాలని ఆయన కోరారు. పెద్దపులి వల్ల పెంపుడు జంతువులకు, ప్రజలకు నష్టం జరిగితే వెంటనే పైన తెలిపిన టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం వారికి వెంటనే అటవీశాఖ ద్వారా నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు.

Whats_app_banner