తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eamcet - Bipc : ఇవాళ్టి నుంచి ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌ - ముఖ్య తేదీలు, సీట్ల వివరాలివే

TS EAMCET - BiPC : ఇవాళ్టి నుంచి ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌ - ముఖ్య తేదీలు, సీట్ల వివరాలివే

02 September 2023, 7:41 IST

    • TS EAMCET BiPC Counselling Updates: నేటి నుంచి ఎంసెట్ బైపీసీ అభ్య‌ర్థుల‌కు నుంచి కౌన్సెలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. 
నేటి నుంచి ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌
నేటి నుంచి ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌ (tseamcet)

నేటి నుంచి ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌

TS EAMCET BiPC Counselling 2023: ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఇవాళ్టి నుంచి ఎంసెట్ బైపీసీ అభ్య‌ర్థుల‌కు కౌన్సెలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా బీ - ఫార్మ‌సీ, ఫార్మా డీ త‌దిత‌ర కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. రిజిస్ట్రేషన్లు, వెబ్ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపుతో పాటు పలు వివరాలను పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

ముఖ్య వివరాలు:

సెప్టెంబర్ 2 - ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, స్లాట్‌బుకింగ్‌ ప్రారంభం

సెప్టెంబర్ 4, 5 తేదీల్లో అభ్య‌ర్థుల ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలన

సెప్టెంబర్ 4 నుంచి 9 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లను ఎంచుకోవాలి.

సెప్టెంబర్ 11వ తేదీన సీట్ల కేటాయింపు

సెప్టెంబర్ 11 - 14 తేదీల మధ్య ఆయా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్టింగ్ చేయాలి.

సెప్టెంబర్ 17వ తేదీ నుంచి తుది దశ కౌన్సెలింగ్

సెప్టెంబర్ 18వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్

17,19 తేదీల్లో వెబ్ ఆప్షన్లు

23వ తేదీన తుది దశ సీట్ల కేటాయింపు

23 నుంచి 26 తేదీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి.

సెప్టెంబర్ 24వ తేదీన స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయి.

పూర్తి వివరాల కోసం https://tseamcetb.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

సీట్ల ఖాళీలు:

బీ ఫార్మ‌సీకి సంబంధించి 114 కాలేజీల్లో 6910 క‌న్వీన‌ర్ కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇక ఫార్మ్ -డీలో చూస్తే 61 కాలేజీల్లో 1191 క‌న్వీన‌ర్ కోటా సీట్లు, బ‌యోటెక్నాల‌జీలో 94, బ‌యోమెడిక‌ల్ ఇంజినీరింగ్‌లో 36 సీట్లు ఉన్నాయి. ఫార్మాస్యూటిక‌ల్ ఇంజినీరింగ్‌లో 81 సీట్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం