తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Constable Exam : కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం ఎంతమంది పరీక్ష రాశారంటే?

Constable Exam : కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం ఎంతమంది పరీక్ష రాశారంటే?

HT Telugu Desk HT Telugu

28 August 2022, 20:20 IST

    • తెలంగాణలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం ప్రాథమిక రాతపరీక్ష ముగిసింది. ఈ పరీక్షకు 6 లక్షల 3 వేల 955 మంది హాజరయ్యారు.
కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రాథమిక రాతపరీక్ష
కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రాథమిక రాతపరీక్ష

కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రాథమిక రాతపరీక్ష

తెలంగాణలో కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షకు 6 లక్షల 61 వేల 198 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 6 లక్షల 3 వేల 955 మంది పరీక్ష రాశారు. 91.34 శాతం హాజరైనట్లు అధికారులు తెలిపారు. నిమిషం ఆలస్యం నిబంధనతో కొన్నిచోట్ల పలువురు అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు.

ట్రెండింగ్ వార్తలు

Medak Thunderstrom: మెదక్ జిల్లాలో అకాల వర్షం… పిడుగు పాటుతో తాత మనుమడి మృతి, ధాన్యం కాపాడుకునే ప్రయత్నంలో విషాదం

Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఘోరం, బైక్‌‌లో మంటలు ఆర్పుతుండగా భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 38 పట్టణాల్లోని 1,601 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది . SCT PC సివిల్ లేదా తత్సమాన పోస్టుల 15,644 ఖాళీలు, రవాణా కానిస్టేబుళ్ల 63 ఖాళీలు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల 614 ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్ష నిర్వహించారు. పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 28, 2022న జారీ అయింది.

'అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం అన్ని నిబంధనలు, నిబంధనలకు కట్టుబడి పరీక్ష సజావుగా నిర్వహించాం. తదుపరి ప్రక్రియల నిర్వహణను సులభతరం చేసేందుకు అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు, డిజిటల్ వేలిముద్రలు, ఛాయాచిత్రాలతో సహా పరీక్ష సమయంలో తీసుకున్నాం.' బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాసరావు అన్నారు.

దేహధారుడ్య పరీక్షలు, తుది పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగానే అనుమతిస్తామని అదికారులు చెప్పారు. పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in లో కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుంది.

తదుపరి వ్యాసం