TS Police Constable Exam: నేడు కానిస్టేబుల్ పరీక్ష - అలా అయితే నో ఎంట్రీ-ts police constable preliminary exam on 28th august 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Police Constable Preliminary Exam On 28th August 2022

TS Police Constable Exam: నేడు కానిస్టేబుల్ పరీక్ష - అలా అయితే నో ఎంట్రీ

HT Telugu Desk HT Telugu
Aug 28, 2022 07:15 AM IST

Constable Exam in Telangana: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్‌ రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. హాల్‌టికెట్‌లు డౌన్​లోడ్​ చేసుకున్న, అభ్యుర్థులు హాల్​టికెట్​పై ఫొటో అతికిస్తేనే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.

కానిస్టేబుల్ పరీక్ష
కానిస్టేబుల్ పరీక్ష

ts police constable preliminary examination:నేడు రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్‌ అభ్యర్థుల రాత పరీక్ష ఆదివారం జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఇప్పటికే హాల్ టికెట్లను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరీక్షకు నిమిషం నిబంధన వర్తింపజేశారు. నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 6.61 లక్షల మందికి పైగా హాజరవుతున్నారు. పరీక్ష కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో 91 కేంద్రాలు ఏర్పాటు చేసిన సిటీ పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది హైదరాబాద్ నగరంలోనే రాసే అవకాశం ఉంది. ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

ఈ రూల్స్ పాటించాల్సిందే....

imp instructions for ts police constable exam: సరిగ్గా ఉదయం 10 గంటలకు గేట్లు మూసేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలకు అనుమతించరు.

హాల్‌ టికెట్ పై బోర్డు సూచించిన విధంగా పాస్‌పోర్టు సైజు ఫొటో కచ్చితంగా అతికించుకుని రావాలి.

పరీక్ష రాసే అభ్యర్థి పరీక్ష గదిలోకి తనవెంట హాల్‌టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్‌ పాయింట్‌పెన్‌ను మాత్రమే తీసుకెళ్లాలి.

సెల్‌ఫోన్‌, టాబ్లెట్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ డివైజ్‌, చేతిగడియారం, కాలిక్యులేటర్‌, లాగ్‌టేబుల్‌, వాలెట్‌, పర్స్‌, నోట్స్‌, చార్ట్‌, రికార్డింగ్‌ పరికరాలు, ఖాళీపేపర్లను వెంట తీసుకెళ్లరాదు.

ఓఎంఆర్‌ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు వంటివి రాస్తే మాల్‌ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.

మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదు. విలువైన వస్తువుల్ని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో క్లోక్‌రూం సదుపాయం ఉండదు.

పరీక్షపత్రం బుక్‌లెట్‌లో ఇంగ్లిష్‌-తెలుగు, ఇంగ్లిష్‌-ఉర్దూ భాషలలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలుంటే ఇంగ్లిష్‌ వెర్షన్‌నే పరిగణనలోకి తీసుకోవాలి.

Constable Exam in Telangana: నిజానికి కానిస్టేబుల్ రాతపరీక్ష ఈ నెల 21న జరగాల్సిన పరీక్షను.. 28వ తేదీకి వాయిదా వేశారు. సాంకేతిక కారణాలతో తేదీని మార్పు చేసినట్టుగా రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం.. సివిల్, ఏఆర్, తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్, మెకానిక్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు.

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 28న ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహిస్తారు. హాల్ టికెట్స్ ఆగస్టు 18న విడుదల చేశారు. అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం