Constable Exam Postponed : కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?-ts constable exam postponed due to technical issues here s exam date ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Constable Exam Postponed : కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Constable Exam Postponed : కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

HT Telugu Desk HT Telugu
Aug 08, 2022 05:50 PM IST

కానిస్టేబుల్ రాతపరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా
కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా (unplash)

తెలంగాణలో కానిస్టేబుల్ రాతపరీక్ష వాయిదా పడింది. ఈ నెల 21న జరగాల్సిన పరీక్షను.. 28వ తేదీకి వాయిదా వేశారు. సాంకేతిక కారణాలతో తేదీని మార్పు చేసినట్టుగా రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించింది.

తెలంగాణ ప్రభుత్వం.. సివిల్, ఏఆర్, తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్, మెకానిక్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.

2022 ఆగస్ట్ 21న పరీక్ష జరగాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో ఎగ్జామ్‌ను వారం రోజులు వాయిదా వేసింది. ఆగస్టు 28న పరీక్షను నిర్వహిస్తారు. మెుత్తం 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 25న, 63 ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు, 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఈ పోస్టులకు 21 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ కానీ లాజిస్టిక్స్, పరిపాలనా పరమైన కారణాలతో వాయిదా వేసి.. 28న నిర్వహిస్తోంది.

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 28న ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహిస్తారు. హాల్ టికెట్స్ ఆగస్టు 18న విడుదల చేస్తారు. అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్‌లో ఆగస్ట్ 18 నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point