తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Si Events 2022: ఎస్ఐ ఉద్యోగ బరిలో తల్లి, కుమార్తె.. ఈవెంట్స్ కూడా పాస్

TS SI Events 2022: ఎస్ఐ ఉద్యోగ బరిలో తల్లి, కుమార్తె.. ఈవెంట్స్ కూడా పాస్

HT Telugu Desk HT Telugu

15 December 2022, 13:00 IST

    • Telangana Police Constable and SI Events 2022: ఎంతో కఠినతరమైన ఎస్ఐ ఫిజికల్ టెస్టులో తల్లీకూతురు ఒకేసారి అర్హత సాధించారు. ఈ ఆసక్తికర పరిణామం ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. 
SI సెలక్షన్‌లో తల్లి కూతుళ్ళు సెలెక్ట్
SI సెలక్షన్‌లో తల్లి కూతుళ్ళు సెలెక్ట్

SI సెలక్షన్‌లో తల్లి కూతుళ్ళు సెలెక్ట్

Mother Daughter Qualified For SI Physical Events: తల్లి కానిస్టేబుల్... కుమార్తె పీజీ చేసింది..! కానీ వారిద్దరి టార్గెట్ ఎస్ఐ ఉద్యోగం. అయితే ఈసారి జరుగుతున్న పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారు... ఫిజికల్ పరీక్షలోనూ పాస్ కావటం విశేషంగా నిలిచింది. వారిద్దరి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Hyderabadi In UK Polls: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో సిద్ధిపేట ఐటీ ఇంజనీర్‌, లేబర్ పార్టీ తరపున పోటీ

Graduate Mlc Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ గురి, కీలక నేతలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు

Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన నాగమణి, ఆమె కూతురు ఎస్సై ఈవెంట్స్ లో పాసయ్యారు. నాగమణి గతంలో హోంగార్డుగా పనిచేస్తూ సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికై ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో పని చేస్తున్నారు. ఆమె కూడా ఎస్సై ఉద్యోగం సాధించేందుకు శ్రమిస్తున్నారు. ఆమె కుమార్తె కూడా తల్లి బాటలోనే ఎస్సై ఉద్యోగానికి పోటీ పడుతున్నారు. ఇద్దరూ బుధవారం ఖమ్మం పరేడ్‌ మైదానంలో ఒకే బ్యాచ్‌లో శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యారు. ఇద్దరూ అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, తుది పరీక్షకు అర్హత సాధించడం విశేషంగా మారింది. ఇరువురి ప్రతిభకు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 కేంద్రాల్లో పోలీస్ రిక్రూట్ మెంట్ శారీరర సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈవెంట్స్ కు సంబంధించి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్న అభ్యర్థులు ఈ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. శారీరక సామర్ధ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచించారు అధికారులు. బయోమెట్రిక్ ద్వారా పరీక్షలకు అనుమతిస్తున్నారు. పార్ట్ 2 అప్లికేషన్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ను వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేస్తున్నారు. జనవరి తొలి వారం వరకు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవటంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే... support@tslprb.in అడ్రస్ కు మెయిల్ చేయవచ్చని వివరించారు. లేకపోతే ఈ ఫోన్ నెంబర్లను (93937 11110 or 93910 05006) సంప్రదించవచ్చు.

తదుపరి వ్యాసం