TS SI Constable Events Dates: డిసెంబర్ 8 నుంచి SI, కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్-telangana police constable and si events dates declared by tslprb ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Police Constable And Si Events Dates Declared By Tslprb

TS SI Constable Events Dates: డిసెంబర్ 8 నుంచి SI, కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్

HT Telugu Desk HT Telugu
Nov 27, 2022 11:12 AM IST

telangana police jobs updates: పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా చేపట్టే ఈవెంట్స్(శారీరక సామర్థ్య పరీక్షల) నిర్వహణపై రిక్రూట్ మెంట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. కీలకమైన ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌(పీఎంటీ) తేదీలను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

ఈవెంట్స్ పై పోలీస్ శాఖ ప్రకటన
ఈవెంట్స్ పై పోలీస్ శాఖ ప్రకటన (HT)

Telangana Police Constable and SI Events 2022: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణపై ప్రకటన చేసింది తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. ఎంపిక ప్రక్రియలో కీలకమైన ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌(పీఎంటీ)లు డిసెంబర్ 8 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

11 కేంద్రాలు ఎంపిక…

ఈవెంట్స్ పరీక్షలను నిర్వహించేందుకు 11 కేంద్రాలను ఎంపిక చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. మొత్తం ఈవెంట్స్ ప్రక్రియను 23 - 25 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేసింది. జనవరి తొలి వారం వరకు పూర్తి చేస్తామని తెలిపింది.

29 నుంచి అడ్మిట్ కార్డులు…

అభ్యర్థులు ఈనెల 29 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 3 వ తేదీ అర్ధరాత్రి వరకు వీటిని పొందవచ్చని అధికారులు వెల్లడించారు. www.tslprb.in ద్వారా వీటిని పొందవచ్చని పేర్కొన్నారు. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవటంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే... support@tslprb.in అడ్రస్ కు మెయిల్ చేయవచ్చని వివరించారు. లేకపోతే ఈ ఫోన్ నెంబర్లను (93937 11110 or 93910 05006) సంప్రదించవచ్చు.

NOTE: ఈవెంట్స్ కు సంబంధించి పోలీస్ శాఖ విడుదల చేసి ప్రకటనను కింద ఇచ్చిన పీడీఎఫ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఈవెంట్స్ కేంద్రాలు, అడ్మిట్ కార్డులు, అభ్యర్థులు పాటంచాల్సిన నిబంధనలను పేర్కొన్నారు.

IPL_Entry_Point