తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Liquor Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్...! ఆ రోజు వైన్ షాపులు బంద్

TS Liquor Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్...! ఆ రోజు వైన్ షాపులు బంద్

22 April 2024, 7:36 IST

    • Liquor Shops Close in Hyderabad: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది సర్కార్. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 23న హైదరాబాద్ మద్యం దుకాణాలు ముసివేయాలని నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
వైన్ షాపులు బంద్
వైన్ షాపులు బంద్ (Photo Source from unsplash.com)

వైన్ షాపులు బంద్

Liquor Shops Close in Hyderabad City: మద్యం ప్రియులకు మరోసారి షాక్ ఇచ్చే న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్(TS Govt). ఈనెల 23వ తేదీన హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) సందర్భంగా వైన్స్ షాపులను బంద్ చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Karimnagar Rains : అకాల వర్షాలు, తడిసిపోయిన ధాన్యం..! అన్నదాత ఆగమాగం

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

BRS Mlc Election Burden: బీఆర్​ఎస్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ భారమంతా ‘పల్లా’పైనే! సహకరించని గులాబీ​ నేతలు

ఇదే నెలలో అంటే ఏప్రిల్ 17న కూడా హైదరాబాద్ జంటనగరాల్లో వైన్స్ షాపులు మూతపడ్డాయి. శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా జంట నగరాల్లో(హైదరాబాద్, సికింద్రాబాద్) వైన్ షాపులను(Wine Shops Close) ముసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేసి ఉంచారు. వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు 24 గంటలపాటు మూతపడ్డాయి.

బీర్లకు తెగ డిమాండ్…..

మద్యం ప్రియులకు సమ్మర్(Summer) అంటే గుర్తొచ్చేది చిల్డ్ బీర్(Chilled Beer). సాయంత్రం కూల్ గా ఓ బీర్, కాస్త స్టఫ్ దగ్గర పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటారు. తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. దీంతో మందుబాబులు కూల్ అయ్యేందుకు వైన్ షాపుల(Wine Shops) వైపు అడుగులు వేశారు.అందినకాడికి బీర్లు తాగేశారు. ఒక్కసారిగా బీర్ల కొనుగోలు(Beer Sales) పెరగడంతో...స్టాక్ ఖాళీ అయ్యింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. రేషన్ ఆధారంగా ప్రధాన బ్రాండ్ల బీర్లను ఒక్కో షాపునకు 20-25 కేస్ లు ఇస్తుండగా...ఇవి సరిపోవడంలేదని మద్యం షాపుల యజమానులు అంటున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజుకు 60 వేల నుంచి 80 వేల కేస్ లకు పైగా బీర్లు (Beers Demand)అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ లో వీటికి అదనంగా మరో 20 వేల కేస్ లు డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం డిమాండ్ కు తగిన స్టాక్ లేకపోవడంతో మద్యం డిపోలు 60 వేల నుంచి 80 వేల కేస్ లను మద్యం షాపులకు సరఫరా చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత(Summer Heat) ఎక్కువగా ఉండడంతో...మందుబాబులు బీర్లు లాగించేస్తు్న్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బీర్ల సేల్స్‌ అమాంతం పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీర్లకు డిమాండ్‌ పెరుగుతోందని మద్యం షాపుల నిర్వాహకులు అంటున్నారు. బీర్‌ల కంపెనీల నుంచి రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేస్‌ల స్టాక్ వస్తుందని ఎక్సైజ్‌ శాఖ(Excise Department) వర్గాలు చెబుతున్నాయి. వీటిల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. గత ఏప్రిల్‌ లో హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 12 లక్షల కేస్‌లకు పైగా బీర్ల సెల్స్(Beer Sales) జరిగితే....ప్రస్తుతం 15 లక్షల కేస్‌లకు పైగా డిమాండ్‌ వస్తుందని మద్యం వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేస్ ల బీర్లు విక్రయాలు జరుగుతాయని గణాంకాలు చెబుతున్నాయి.

 

తదుపరి వ్యాసం