తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cancelled Trains: అలర్ట్…. కాచిగూడ - మెదక్ మధ్య రైళ్లు రద్దు, తేదీలివే

Cancelled Trains: అలర్ట్…. కాచిగూడ - మెదక్ మధ్య రైళ్లు రద్దు, తేదీలివే

HT Telugu Desk HT Telugu

17 February 2023, 5:04 IST

    • South Central Railway Updates : దక్షిణ మధ్య రైళ్లు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో మెదక్ - కాచిగూడ, నాందేడ్ - ఆదిలాబాద్ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి.
పలు రైళ్లు రద్దు
పలు రైళ్లు రద్దు (facebook)

పలు రైళ్లు రద్దు

SCR Cancelled Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. పలుమార్గాల్లో నడిచే రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. మరమ్మత్తు పనుల కారణంగా వీటిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆయా వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

Bhadradri District : ఎంత అమానుషం! పండగకు చందా ఇవ్వలేదని 19 కుటుంబాల గ్రామ బహిష్కరణ

కాచిగూడ - మెదక్ (ట్రైన్ నెంబర్ 07850) మధ్య నడిచే రైలును ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక మెదక్ నుంచి కాచిగూడ (నెంబర్ - 07588) మధ్య నడిచే రైలును కూడా ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఇక ఆదిలాబాద్ - నాందేడ్ (ట్రైన్ నెంబర్ - 17409) మధ్య నడిచే రైలును కూడా రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇది ఫిబ్రవరి 17వ తేదీన మాత్రమే రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా నాదేండ్ - ఆదిలాబాద్ మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ - 1740) రైలును కూడా ఫిబ్రవరి 17వ తేదీన రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని ఓ ప్రకటనలో కోరింది.

రైళ్లలో పుడ్ డెలివరీ - సరికొత్త సేవలు...

IRCTC Food Delivery: వాట్సాప్ ద్వారా ఆహార పదార్థాలను ఆర్డర్ చేసే కొత్త సేవల్ని భారతీయ రైల్వే ప్రారంభించింది. క్యాటరింగ్ సేవల ద్వారా రైలు ప్రయాణికులు వాట్సాప్ నుంచి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్, పి ఎస్ యూ , ఐ ఆర్ సి టి సి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. వినియోగదారులకు పరస్పర సంభాషణ కోసం వాట్సాప్ నంబర్ +91-8750001323ను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ చాట్‌బాట్ ద్వారా ప్రయాణికులు అన్ని రకాల ఈ కేటరింగ్ సేవలను ఉపయోగించుకోవడంతో పాటు భోజనాన్ని ఆర్డర్ చేయొచ్చు .

ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణికులకు వాట్సాప్ నుండి ఈ కేటరింగ్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి వారి సూచనల ఆధారంగా ఇతర రైళ్లలో కుడా దశల వారీగా అమలుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయ రైల్వేలతో పాటు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. .ఐ ఆర్ సి టి సి ప్రత్యేకంగా రూపొందించిన చేసిన వెబ్‌సైట్ www.catering.irctc.co.in ద్వారా ఫుడ్ ఆన్ ట్రాక్ కోసం “ఈ -కేటరింగ్ యాప్” సేవలను ప్రారంభించింది.

వినియోగదారులకు ఈ -కేటరింగ్ సేవలను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఒక అడుగు ముందుకు వేసి, ఈ -కేటరింగ్ విధానం ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించారు. ఈ సేవల కోసం వాట్సాప్ నంబర్ +91-8750001323 అందుబాటులోకి తీసుకువచ్చారు. వాట్సాప్ సంభాషణ ద్వారా ఈ కేటరింగ్ సేవలను రెండు దశల్లో అమలుపర్చడానికి ప్రణాళికలు రూపొందించారు . మొదటి దశలో www.ecatering.irctc.co.in లింక్‌ను క్లిక్ చేస్తే ల వాట్సప్ నుండి ఈ -కేటరింగ్ సేవలను ఎంచుకోవడానికి వీలవుతుంది. వినియోగదారులు ఇ-టికెట్‌కు ఓ సందేశాన్ని పంపుతుంది. దీని ద్వారా వినియోగదారులు యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా స్టేషన్లలో అందుబాటులో ఉన్న తమకు నచ్చిన రెస్టారెంట్ల నుండి తమకు నచ్చిన భోజనాన్ని బుక్ చేసుకోవచ్చు.

తదుపరి దశ సేవలలో, వాట్సాప్ నంబర్ ద్వారా AI పవర్ చాట్‌ నుండి వినియోగదారులకు ఈ కేటరింగ్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసేందుకు మరియు అన్ని రకాల కేటరింగ్ సేవలకు సంబందించిన సందేహాలను నివృత్తి కోసం చాట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది . ఈ తరహా సేవలు మొదటగా ఎంపిక చేసిన రైళ్లలో అమలు చేయనున్నారు. ప్రయాణికులకు ఈ -కేటరింగ్ సేవల కోసం వాట్సాప్ సంభాషణ అమలు చేస్తున్నారు .

తదుపరి వ్యాసం