Railway Food: నాసిరకం ఆహారంపై రైల్వే ప్యాసింజర్ ఆగ్రహం: “మీ కుటుంబానికైతే ఇలాంటి ఆహారం ఇస్తారా” అంటూ..-woman passenger complains railway food irctc responds ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Railway Food: నాసిరకం ఆహారంపై రైల్వే ప్యాసింజర్ ఆగ్రహం: “మీ కుటుంబానికైతే ఇలాంటి ఆహారం ఇస్తారా” అంటూ..

Railway Food: నాసిరకం ఆహారంపై రైల్వే ప్యాసింజర్ ఆగ్రహం: “మీ కుటుంబానికైతే ఇలాంటి ఆహారం ఇస్తారా” అంటూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 15, 2023 01:13 PM IST

Railway Food: రైలులో తనకు అందించిన ఆహారం పట్ల ఓ ప్యాసింజర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకంగా ఉందంటూ ఐఆర్‌సీటీసీ (IRCTC) కి ఫిర్యాదు చేశారు.

ఆహారం నాణ్యతగా లేదంటూ ప్రయాణికురాలు పోస్ట్ చేసిన ఫొటో ఇది (Photo: (@thisisbhumika)
ఆహారం నాణ్యతగా లేదంటూ ప్రయాణికురాలు పోస్ట్ చేసిన ఫొటో ఇది (Photo: (@thisisbhumika)

Railway Food: రైలులో తనకు ఇచ్చిన భోజనం నాసిరకంగా ఉందంటూ ఓ ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజమ్ కార్పొరేషన్ (IRCTC)కి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌లో ఆ భోజనం ఫొటోను భూమిక అనే ప్రయాణికురాలు పోస్ట్ చేశారు. ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ హ్యాండిల్‍కు ట్యాగ్ చేశారు. ధరలు పెంచిన తర్వాత కూడా ప్రయాణికులకు ఎందుకు ఇలాంటి బాడ్ క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. “మీ సొంత పిల్లలకు, మీ కుటుంబానికి ఇలాంటి నాసిరకం, రుచిలేని ఆహారాన్ని ఎప్పుడైనా ఇచ్చారా” అని ఆమె ట్వీట్ చేశారు. ఇందుకు ఐఆర్‌సీటీసీ స్పందించింది.

ధర పెరిగినా.. ఇలాగేనా!

Railway Food: “మీరు తయారు చేసిన ఫుడ్‍ను మీరు ఎప్పుడైనా రుచి చూశారా, ఐఆర్‌సీటీసీ? ఇలాంటి నాణ్యత లేని, రుచి లేని ఆహారాన్ని మీ సొంత కుటుంబానికి, పిల్లలకు ఎప్పుడైనా ఇచ్చారా?. రోజురోజుకు టికెట్ ధరలు పెరుగుతున్నాయి. కానీ కస్టమర్లకు ఆహారాన్ని అదే బ్యాడ్ క్వాలిటీతో అందిస్తున్నారు” అని భూమిక ట్వీట్ చేశారు. ఆమె హోమియోపతి డాక్టర్ అని.. ట్విట్టర్ బయో ద్వారా తెలుస్తోంది.

వారి తప్పు కాదు

Railway Food: “నేను ఐఆర్‌సీటీసీ రైలు సిబ్బందిని టార్గెట్ చేసి ఈ పోస్ట్ పెట్టలేదు. ఇది వారి తప్పు కాదు. ఐఆర్‌సీటీసీ ఆహారాన్ని అందిస్తూ వారి పని వారు చేస్తున్నారు. ఫుడ్ స్టాఫ్ మెంబర్స్ నా డబ్బును రీఫండ్ చేయడానికి వచ్చారు. కానీ ఇది వారి తప్పుకాదు” అని ఆమె మరో ట్వీట్ చేశారు.

భూమిక ఫిర్యాదుపై ఐఆర్‌సీటీసీ స్పందించింది. ఆమెను సర్ అంటూ సంబోధించింది. టికెట్ వివరాలను షేర్ చేయాలని కోరింది.

నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన

Railway Food: రైలులో ఫుడ్ క్వాలిటీ బాగోలేదంటూ భూమిక చేసిన పోస్టుకు ట్విట్టర్‌లో నెటిజన్లు స్పందిస్తున్నారు. “కస్టమర్ల డబ్బు అంతా ఎక్కడికి పోతోంది. రైళ్లలో ఇప్పటికీ అపరిశుభ్రమైన వాష్‍రూమ్‍లు, నాణ్యత లేని ఫుడ్ ఉంటోంది. దీన్ని కనీసం ఆహారం అని కూడా ఎలా అనగలం. ఈ భోజనం తింటున్నప్పుడు ప్రతీ ప్యాసింజర్ రియాక్షన్‍ను మీరు గమనించాలి” అని ఓ యూజర్ రాసుకొచ్చారు. అయితే భోజనం కోసం రూ.80 చెల్లించి మీరు ఇలా కంప్లైట్ చేయకూడదని మరో యూజర్ కామెంట్ చేశారు. దీనికి భూమిక స్పందించారు. “మేం చేస్తాం (కంప్లైట్). ఇది మా హక్కు. రూ.90, రూ.120 విలువైన రెండు ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాం. అవి అసలు బాగలేవు” అని భూమి రిప్లై ఇచ్చారు.

Railway Food: రైళ్లలో అందించే ఆహారం నాణ్యత గురించి ఫిర్యాదులు రావడం ఇది కొత్తేం కాదు. తరచూ ప్రయాణికులు.. రైళ్లలో భోజనాల గురించి కంప్లైట్లు చేస్తుంటారు. ఇటీవల సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోనూ ఇలాగే జరిగింది. ఫుడ్ క్వాలిటీ బాగోలేదంటూ ఓ వ్యక్తి వీడియో పోస్ట్ చేశారు. వడను పిండితే భారీగా నూనె బయటికి వచ్చినట్టు ఆ వీడియోలో ఉంది.

Whats_app_banner

టాపిక్