తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wpl 2023: స్పాన్సర్లు లేక.. బ్యాట్‌పై ధోనీ పేరు రాసుకొని దంచికొట్టింది

WPL 2023: స్పాన్సర్లు లేక.. బ్యాట్‌పై ధోనీ పేరు రాసుకొని దంచికొట్టింది

Hari Prasad S HT Telugu

06 March 2023, 15:42 IST

    • WPL 2023: స్పాన్సర్లు లేక.. బ్యాట్‌పై ధోనీ పేరు రాసుకొని దంచికొట్టింది వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో కిరణ్ నావ్‌గిరె అనే ఓ ప్లేయర్. ఇప్పుడామె బ్యాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన బ్యాటుపై ఎమ్మెస్‌డీ 07 అని రాసుకున్న కిరణ్ నావ్‌గిరె
తన బ్యాటుపై ఎమ్మెస్‌డీ 07 అని రాసుకున్న కిరణ్ నావ్‌గిరె

తన బ్యాటుపై ఎమ్మెస్‌డీ 07 అని రాసుకున్న కిరణ్ నావ్‌గిరె

WPL 2023: ఎమ్మెస్ ధోనీ.. ఇండియన్ క్రికెట్ లో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ప్లేయర్. మెన్స్ క్రికెట్ లోనే కాదు.. వుమెన్స్ క్రికెట్ లోనూ ధోనీ నుంచి స్ఫూర్తి పొందిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి ప్లేయర్స్ లో ఒకరు కిరణ్ నావ్‌గిరె. యూపీ వారియర్స్ టీమ్ కు చెందిన ఈ ప్లేయర్.. తాజాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) లీగ్ లో ధోనీపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కిరణ్ చెలరేగి ఆడింది. 43 బంతుల్లోనే 53 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. ధోనీకి వీరాభిమాని అయిన కిరణ్ ఆడిన ఇన్నింగ్సే కాదు.. ఈ మ్యాచ్ లో ఆమె బ్యాట్ చాలా మందిని ఆకర్షించింది. దీనికి కారణం ఆ బ్యాట్ పై ధోనీ పేరు ఉండటమే. ఎమ్మెస్‌డీ 07 అని రాసి ఉన్న బ్యాట్ ను ఆమె వాడింది.

సాధారణంగా క్రికెటర్ల బ్యాట్ పై కూడా స్పాన్సర్లకు సంబంధించిన స్టికర్ ఉంటుంది. అయితే కిరణ్ కు మాత్రం అలాంటి స్పాన్సర్లు ఎవరూ లేరు. దీంతో ఆమె తన ఆరాధ్య క్రికెటర్ అయిన ధోనీ పేరునే ఇలా షార్ట్ గా ఎమ్మెస్‌డీ 07 అని రాయించుకుంది. 07 ధోనీ లక్కీ నంబర్. అతని జెర్సీ నంబర్ కూడా. దీంతో అతని పేరు, నంబర్ కలిపి బ్యాట్ పై రాసుకోవడం విశేషం.

ఈ బ్యాట్ తో ఆమె గుజరాత్ జెయింట్స్ బౌలర్లను చితకబాదుంటే.. ఆమె బ్యాట్ గురించి కామెంటేటర్లు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ బ్యాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కిరణ్ ను అభినందిస్తూ ఎంతోమంది పోస్టులు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో చివరికి యూపీ వారియర్స్ విజయం సాధించింది. తొలి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) గత శనివారం (మార్చి 4) ప్రారంభమైన విషయం తెలిసిందే.

టాపిక్

తదుపరి వ్యాసం