WPL 2023 Opening Ceremony: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ సెలబ్రెటీలు.. ముద్దుగుమ్మల పర్ఫార్మెన్స్
WPL 2023 Opening Ceremony: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్ శనివారం నుంచి మొదలుకానుంది. ఈ మేరకు ఘనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరు కానున్నారు. అంతేకాకుండా అదిరిపోయే లైఫ్ పర్ఫార్మెన్స్‌లు ఇవ్వనున్నారు.
WPL 2023 Opening Ceremony: ఐపీఎల్ తరహాలో మహిళల కోసం వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) జరగనుంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి అంతా సిద్ధమైంది. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ మధ్య డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ రోజు నుంచి వచ్చే 22 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. ఇందులో శనివారం నాడు ముంబయి వేదికగా ఘనంగా ఈ టోర్నీ ప్రారంభోత్సవం(WPL Opening Ceremony) జరగనుంది. బీసీసీఐ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ఓపెనింగ్ సెర్మనీకి బాలీవుడ్ అతిరథ మహారథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
బాలీవుడ్ హీరోయిన్లు కృతి సనన్, కియారా అద్వానీ లాంటి స్టార్ హీరోయిన్లతో పాటు పలువురు సినీ ప్రముఖుల మెమెరబుల్ పర్ఫార్మెన్స్‌లు ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చారిత్రక సిరీస్ ముద్దుగుమ్మ ప్రదర్శనతో గ్రాండ్‌గా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
"టోర్నమెంట్ ప్రారంభానికి గ్లామర్ జోడిస్తూ బాలీవుడ్ తారలైన కియారా అద్వానీ, కృతి సనన్ ప్రదర్శనలు జరగనున్నాయి. అంతేకాకుండా ప్రముఖ గాయకుడు, గేయరచయిత ఏపీ ధిల్లాన్ అదిరిపోయే మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తుంది." అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా ప్రారంభ వేడుకల కారణంగా తొలి మ్యాచ్ రీషెడ్యూల్ అయినట్లు బీసీసీఐ సమాచారం.
"శనివారం జరగనున్న ఓపెనింగ్ మ్యాచ్ రీషెడ్యూల్ చేయడమైంది. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుుతంది. టాస్ 7.30 గంటలకు జరుగుతుంది." అని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ టోర్నీలో మొత్తం 20 లీగ్ మ్యాచ్‌లు రెండు ప్లే ఆఫ్ గేమ్‌లు జరుగుతాయి. మొత్తం 23 రోజుల పాటు 7 దేశాలకు చెందిన 87 మంది మహిళా క్రికెటర్లు ఆడనున్నారు.
లీగ్‌లో చివరి మ్యాచ్ మార్చి 21న బ్రబౌర్న్ స్డేటియంలో జరుగుతుంది. యూపీ వారియర్స్-దిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్ మార్చి 24న డీవై పాటిల్ స్డేడియంలో జరుగుతుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ మ్యాచ్ మార్చి 26న బ్రబౌర్న్ స్టేడియంలో నిర్వహిస్తారు.