తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni Ipl 2023: త‌ళా ద‌ర్శ‌నం ఫైన‌ల్లీ - ఐపీఎల్ కోసం చెన్నై చేరుకున్న ధోనీ

Dhoni Ipl 2023: త‌ళా ద‌ర్శ‌నం ఫైన‌ల్లీ - ఐపీఎల్ కోసం చెన్నై చేరుకున్న ధోనీ

03 March 2023, 8:43 IST

  • Dhoni Ipl 2023: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వినిపించాడు ధోనీ. ఐపీఎల్ 2023 కోసం గురువారం చెన్నై విచ్చేశాడు. ధోనీ చైన్నైలో అడుగుపెట్టిన ఫొటోలు సోష‌ల్ మీడియాలోవైర‌ల్‌గా మారాయి.

ధోనీ
ధోనీ

ధోనీ

Dhoni Ipl 2023: ఐపీఎల్ 2023 కోసం ధోనీ చెన్నైలో అడుగుపెట్టాడు. గురువారం చెన్నైకి వచ్చిన ధోనీకి ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ధోనీ ఎయిర్‌పోర్ట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో బ్లూ కలర్ టీషర్ట్, మాస్క్ ధ‌రించి ధోనీ క‌నిపిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా చెన్నై టీమ్ బ‌స చేసిన హోట‌ల్‌కు ధోనీ చేరుకున్నాడు. ధోనీ చెన్నై వ‌చ్చిన విష‌యాన్ని సీఎస్‌కే ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

త‌ళా ద‌ర్శ‌నం ఫైన‌ల్లీ అంటూ ట్వీట్ చేసింది. అత‌డు హోట‌ల్‌కు చేరుకున్న వీడియోను పోస్ట్ చేసింది. శుక్ర‌వారం లేదా శ‌నివారం నుంచి ధోనీ ప్రాక్టీస్ సెష‌న్స్‌లో పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 ఎడిష‌న్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నుంది. గ‌త ఏడాది చెన్నై సూప‌ర్ కింగ్స్ సార‌థ్య బాధ్య‌త‌ల్ని జ‌డేజాకు అప్ప‌గించాడు ధోనీ.

కానీ జడేజా కెప్టెన్సీలో వ‌రుస ప‌రాజ‌యాల‌తో సీఎస్‌కే డీలా ప‌డ‌టంతో మ‌ధ్య‌లో ధోనీ తిరిగి కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టాడు. 2022 ఐపీఎల్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌ను కొన‌సాగించిన సీఎస్‌కే ఎనిమిదో స్థానంతో ఐపీఎల్‌ను ముగించింది. ఈ ఏడాది ధోనీ సార‌థ్యంలో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌నే ఉత్సాహంతో బ‌రిలో దిగుతోంది. కాగా ధోనీకి ఇదే చివ‌రి ఐపీఎల్ టోర్నీ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సీజ‌న్ త‌ర్వాత ప్లేయర్ గా అత‌డు ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

తదుపరి వ్యాసం