తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Vvs Laxman On Hardik Pandya: హార్దిక్‌ ప్లేయర్స్‌ కెప్టెన్‌.. పాండ్యాపై లక్ష్మణ్‌ ప్రశంసల వర్షం

VVS Laxman on Hardik Pandya: హార్దిక్‌ ప్లేయర్స్‌ కెప్టెన్‌.. పాండ్యాపై లక్ష్మణ్‌ ప్రశంసల వర్షం

Hari Prasad S HT Telugu

17 November 2022, 10:50 IST

    • VVS Laxman on Hardik Pandya: హార్దిక్‌ ప్లేయర్స్‌ కెప్టెన్‌ అంటూ పాండ్యాపై లక్ష్మణ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడే భవిష్యత్తు ఇండియా కెప్టెన్‌ అని భావిస్తున్న నేపథ్యంలో కోచ్‌ లక్ష్మణ్‌ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.
హార్దిక్ పాండ్యాతో వీవీఎస్ లక్ష్మణ్
హార్దిక్ పాండ్యాతో వీవీఎస్ లక్ష్మణ్ (ANI)

హార్దిక్ పాండ్యాతో వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman on Hardik Pandya: టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా దారుణమైన ఓటమి తర్వాత అందరి కళ్లూ ఇప్పుడు హార్దిక్‌ పాండ్యావైపు చూస్తున్నాయి. అతడే భవిష్యత్తు ఇండియా కెప్టెన్‌ అని, టీ20 పగ్గాలు అతడు చేపట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న టీమిండియా టీ20 జట్టుకు పాండ్యానే కెప్టెన్‌గా ఉన్నాడు. శుక్రవారం (నవంబర్ 18) నుంచి ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ నేపథ్యంలో హార్దిక్‌ కెప్టెన్సీపై తాత్కాలిక హెడ్‌ కోచ్‌ వీవీఎస్ లక్ష్మణ్‌ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికే హార్దిక్‌ కెప్టెన్సీలో ఐర్లాండ్‌లో 2-0తో సిరీస్‌ గెలిచింది టీమిండియా. అప్పుడు కూడా లక్ష్మణే కోచ్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో హార్దిక్‌ ప్లేయర్స్‌ కెప్టెన్‌ అంటూ అతని కెప్టెన్సీ గొప్పతనాన్ని వీవీఎస్ వివరించాడు.

"అతడు అద్భుతమైన నాయకుడు. అతడు ఐపీఎల్‌లో ఏం చేశాడో మనం చూశాం. ఐర్లాండ్‌ నుంచీ అతన్ని చూస్తున్నా. అతని పని విధానం ఆదర్శప్రాయంగా ఉంటుంది. అతడు ప్లేయర్స్‌ కెప్టెన్‌. ప్లేయర్స్‌తో అతనితో సులువుగా కలిసిపోగలరు. ముందుండి టీమ్‌ను నడిపిస్తాడు" అంటూ హార్దిక్‌ను ఆకాశానికెత్తాడు.

టీ20 వరల్డ్‌కప్‌లో ఓటమి నేపథ్యంలో ఇప్పుడు న్యూజిలాండ్‌ సిరీస్‌ హార్దిక్‌, లక్ష్మణ్‌లకు అగ్ని పరీక్షగా నిలవనుంది. ఈ సిరీస్‌లో గెలిచి వరల్డ్‌కప్‌లో పోయిన పరువును తిరిగి సంపాదించాల్సి ఉంది. ఈ సందర్భంగా తన టీమ్ ఎలాంటి క్రికెట్‌ ఆడబోతోందో కూడా ఈ సందర్భంగా లక్ష్మణ్‌ చెప్పాడు.

"టీ20 క్రికెట్‌లో స్వేచ్ఛగా, భయం లేకుండా ఆడాల్సి ఉంటుంది. అలాంటి ప్లేయర్స్‌ మా దగ్గర ఉన్నారు. కెప్టెన్‌, మేనేజ్‌మెంట్‌ కూడా వాళ్లకు అలా భయం లేకుండా ఆడాలనే చెప్పారు. అదే సమయంలో పరిస్థితులు, కండిసన్స్‌కు అనుగుణంగా వ్యూహాలు రచించుకోవాలని కూడా సూచించాము" అని లక్ష్మణ్‌ తెలిపాడు.

"బ్యాటింగ్‌ చేయగలిగే సామర్థ్యం ఉన్న బౌలర్లు ఎక్కువ మంది ఉంటే బ్యాటింగ్‌ పటిష్టంగా మారుతుంది. ఈ ఫార్మాట్‌లో అదే అవసరం. చాలా టీమ్స్‌ సెలక్షన్‌లో ఇదే అనుసరిస్తున్నాయి. అలాంటి వాళ్లనే ఎంపిక చేస్తున్నాయి. ఆల్‌రౌండర్లకే ఇందులో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది" అని లక్ష్మణ్‌ స్పష్టం చేశాడు.

ఇక న్యూజిలాండ్‌లో బౌలర్లు, ఫీల్డర్లకు సవాలే అని కూడా అన్నాడు. "న్యూజిలాండ్‌లో గ్రౌండ్స్‌ చిన్నవే అయినా వాటి పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయి. ఆక్లాండ్‌, వెల్లింగ్టన్‌లలో గ్రౌండ్లు సాధారణ క్రికెట్‌ గ్రౌండ్లు కావు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఇలా పరిస్థితులు, కండిషన్స్‌కు అలవాటు పడటమే ముఖ్యం. మా టీమ్‌ అదే చేస్తుందని ఆశిస్తున్నా. ప్రత్యర్థి బలాలు, బలహీనతలకు అనుగుణంగా వ్యూహాలు రచించాల్సి ఉంటుంది" అని లక్ష్మణ్‌ తేల్చి చెప్పాడు.

తదుపరి వ్యాసం