Dravid Take Rest Fir New Zealand Tour: న్యూజిలాండ్ టూర్‌కు ద్రవిడ్ దూరం.. మరి కోచ్ ఎవరు?-rahul dravid given break for new zealand tour laxman to coach india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dravid Take Rest Fir New Zealand Tour: న్యూజిలాండ్ టూర్‌కు ద్రవిడ్ దూరం.. మరి కోచ్ ఎవరు?

Dravid Take Rest Fir New Zealand Tour: న్యూజిలాండ్ టూర్‌కు ద్రవిడ్ దూరం.. మరి కోచ్ ఎవరు?

Maragani Govardhan HT Telugu
Nov 11, 2022 10:14 PM IST

Dravid Take Rest Fir New Zealand Tour: వెల్లింగ్టన్ వేదికగా ఈ నెల 18 నుంచి టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. అయితే ఈ సిరీస్‌కు కోచ్ ద్రవిడ్ దూరంగా ఉండనున్నారు. ఆయన స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు.

రాహుల్ ద్రవిడ్
రాహుల్ ద్రవిడ్ (AFP)

Dravid Take Rest Fir New Zealand Tour: టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా సెమీస్‌లో నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఓటమి పాలైన భారత్.. అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే కోచ్ రాహుల్ ద్రవిడ్‌ విశ్రాంతి తీసుకోనున్నారు. నవంబరు 18 నుంచి న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటించనున్న నేపథ్యంలో.. ఆ సిరీస్‌లకు ద్రవిడ్ దూరం కానున్నారు. దీంతో ఆయన స్థానంలో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్న లక్ష్మణ్.. గతంలోనూ భారత క్రికెట్‌కు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించారు.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐర్లాండ్, జింబాబ్వే సిరీస్‌లకు, గత నెలలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లకు కోచ్‌గా వ్యవహరించారు. ఈ ఏడాది ప్రారంభంలో అండర్-19 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన యువ భారత్‌కు లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత లక్ష్మణ్ కోచ్‌ బాధ్యతల నుంచి వైదొలుగుతారు.

నవంబరు 18 నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ద్రవిడ్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. టీ20 మ్యాచ్‌లకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కెప్టెన్ వ్యవహరించనుండగా.. వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించనున్నాడు. నవంబరు 30న న్యూజిలాండ్‌తో మూడో వన్డే పూర్తి చేసుకున్న భారత్ వెంటనే బంగ్లాదేశ్‌కు ప్రయాణమవుతుంది. డిసెంబరు 4 నుంచి ఆ జట్టుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.

ఇదిలా ఉంటే టీ20 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లీష్ ఓపెనర్లే మ్యాచ్‌ను గెలిపించారు. జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఇద్దరూ చెరో అర్ధశతకంతో దుమ్మురేపి ఇంగ్లీష్ జట్టుకు అదిరిపోయే విజయాన్ని అందించారు. భారత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం