తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Reaction: ఏం ఆట ఇది.. సూర్య హిట్టింగ్‌పై విరాట్ కోహ్లి ఫిదా

Virat Kohli Reaction: ఏం ఆట ఇది.. సూర్య హిట్టింగ్‌పై విరాట్ కోహ్లి ఫిదా

Hari Prasad S HT Telugu

01 September 2022, 8:01 IST

    • Virat Kohli Reaction: అరె ఏం ఆట ఇది అనేలా సూర్య హిట్టింగ్‌పై విరాట్ కోహ్లి ఇచ్చిన రియాక్షన్‌ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. హాంకాంగ్‌పై సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే.
సూర్యను చూపిస్తూ విరాట్ కోహ్లి రియాక్షన్ ఇదీ
సూర్యను చూపిస్తూ విరాట్ కోహ్లి రియాక్షన్ ఇదీ (Sreengrab)

సూర్యను చూపిస్తూ విరాట్ కోహ్లి రియాక్షన్ ఇదీ

Virat Kohli Reaction: ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అందరూ విరాట్‌ కోహ్లి ఫామ్‌లోకి వచ్చాడని సంతోషంగా ఉన్నారు కానీ.. కోహ్లి మాత్రం సూర్యకుమార్‌ ఆటకు ఫిదా అయిపోయాడు. ఇండియా ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత పెవిలియన్‌కు తిరిగి వస్తున్న టైమ్‌లో కోహ్లి రియాక్షన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

సూర్యకు విరాట్‌ టేక్‌ ఎ బో అన్నట్లుగా వంగుతూ అభివాదం చేశాడు. ఆ తర్వాత అతని చేయిలో చేయి వేసి హగ్‌ చేసుకున్నాడు. ఇక పెవిలియన్‌కు వస్తున్న సమయంలో ముందు నడుస్తున్న సూర్యను చూపిస్తూ.. ఏం ఆట ఇది అన్నట్లుగా డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు చూశాడు విరాట్‌ కోహ్లి. అసలు సూర్య ఆడుతున్నంత సేపూ విరాట్‌ అలా చూస్తుండి పోయాడు.

అతడు ఆడే షాట్స్‌ను అవతలి వైపు నుంచి చూస్తూ మైమరచిపోయాడు. గ్రౌండ్‌లో 360 డిగ్రీల్లోనూ అతడు షాట్స్‌ ఆడాడు. ఇలా సూర్య ఒక్కో వెరైటీ షాట్‌ ఆడుతున్నప్పుడల్లా అతని దగ్గరికి వెళ్లి పెద్దగా నవ్వుతూ సూర్యను అభినందించడం కనిపించింది. ఈ మ్యాచ్‌లో సూర్య కేవలం 26 బాల్స్‌లోనే 68 రన్స్‌ చేశాడు. సూర్య ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు సిక్స్‌లు ఉండగా.. అందులో నాలుగు చివరి ఓవర్లో కొట్టినవే కావడం విశేషం.

మరోవైపు విరాట్‌ కోహ్లి కూడా ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై కోహ్లి చివరిసారి టీ20ల్లో ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు చేయగా.. మళ్లీ ఇప్పుడు హాంకాంగ్‌పై 59 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. సూర్యతో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 7 ఓవర్లలోనే 98 రన్స్‌ జోడించడం విశేషం. ఈ ఇద్దరి దూకుడుతో ఇండియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 రన్స్‌ చేసింది. ఆ తర్వాత హాంకాంగ్‌ 152 రన్స్ దగ్గర ఆగిపోవడంతో ఇండియా 40 రన్స్‌తో గెలిచి సూపర్ ఫోర్‌లో అడుగుపెట్టింది.

తదుపరి వ్యాసం