తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Serena In Us Open 2022: దూసుకెళ్తున్న సెరెనా.. వరల్డ్‌ నంబర్‌ 2కి షాకిచ్చిన స్టార్

Serena in US Open 2022: దూసుకెళ్తున్న సెరెనా.. వరల్డ్‌ నంబర్‌ 2కి షాకిచ్చిన స్టార్

Hari Prasad S HT Telugu

01 September 2022, 10:07 IST

    • Serena in US Open 2022: యూఎస్‌ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్‌ దూసుకెళ్తోంది. రెండో రౌండ్‌లో ఆమె ఏకంగా వరల్డ్‌ నంబర్‌ 2 ప్లేయర్‌కే షాకివ్వడం విశేషం.
సెరెనా విలియమ్స్
సెరెనా విలియమ్స్ (AP)

సెరెనా విలియమ్స్

Serena in US Open 2022: అమెరికన్‌ టెన్నిస్‌ లెజెండ్‌ సెరెనా విలియమ్స్‌ తన రికార్డు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ దిశగా దూసుకెళ్తోంది. తన కెరీర్‌లో బహుశా చివరి యూఎస్‌ ఓపెన్‌ ఆడుతున్న ఆమె మూడో రౌండ్‌లో అడుగు పెట్టింది. ఈ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ప్రారంభానికి ముందే ఆమె తన రిటైర్మెంట్‌ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. దీంతో రికార్డు టైటిల్‌తో ఆమె కెరీర్‌ ముగించాలని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

తాజాగా రెండో రౌండ్‌లో సెరెనా వరల్డ్‌ నంబర్‌ 2 అయిన అనెట్‌ కొంటావీట్‌పై విజయం సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో సెరెనా 7-6, 2-6, 6-2 తేడాతో గెలిచింది. తొలి సెట్‌ను టై బ్రేకర్‌లో గెలిచిన ఆమె.. రెండో సెట్‌లో తడబడింది. కీలకమైన సమయంలో రెండు సర్వ్‌లను కోల్పోయి సెట్‌ను చేజార్చుకుంది. అయితే మూడో సెట్‌లో స్ట్రాంగ్‌గా పుంజుకున్న సెరెనా.. ప్రత్యర్థి రెండు సర్వ్‌లు బ్రేక్‌ చేసి 6-2తో సెట్‌తోపాటు మ్యాచ్‌నూ గెలుచుకుంది.

40 ఏళ్ల సెరెనా విలియమ్స్‌ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పి తన ఇతర బిజినెస్‌ల వైపు పూర్తిగా దృష్టి సారించే సమయం వచ్చిందని యూఎస్‌ ఓపెన్‌ ప్రారంభానికి ముందే చెప్పిన విషయం తెలిసిందే. రెండో రౌండ్‌ మ్యాచ్‌ తర్వాత ఆమె మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌ ఓడిపోయినా తాను పెద్దగా కోల్పోయేది ఏదీ లేదని అనడం విశేషం. అయితే గెలవడానికి తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడినట్లు చెప్పింది.

"నేను సెరెనాని అంతే. రెండో సెట్‌లో ఓడిన తర్వాత నేను పూర్తి సామర్థ్యం మేరకు ఆడకపోతే ఇక మ్యాచ్‌ చేజారినట్లే అని అనుకున్నాను. కానీ నేను సూపర్‌ కాంపిటీటివ్‌. నిజాయతీగా చెప్పాలంటే ఈ విజయాన్ని నేనో బోనస్‌గా చూస్తున్నాను. ఇప్పుడు నేను కొత్తగా నిరూపించుకోవడానికి ఏమీ లేదు. 1998 నుంచి ఎప్పుడూ ఇలా ఆడలేదు" అని సెరెనా చెప్పింది.

1999లో 17 ఏళ్ల వయసులో సెరెనా విలియమ్స్‌ ఈ యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌తోనే తన గ్రాండ్‌స్లామ్‌ ఖాతా తెరిచింది. ఇప్పటి వరకూ ఆరుసార్లు ఈ గ్రాండ్‌స్లామ్‌ గెలిచింది. ఇప్పుడు ఏడో టైటిల్‌పై కన్నేసిన ఆమె.. అంతకుముందు నాలుగో రౌండ్‌లో అడుగు పెట్టడానికి శుక్రవారం ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టోమ్‌జనోవిక్‌తో తలపడనుంది.

టాపిక్

తదుపరి వ్యాసం