తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ricky Ponting On Virat Kohli: ఇండియాకు వరల్డ్‌కప్‌ కోహ్లి ఒక్కడి వల్లే సాధ్యం: పాంటింగ్‌

Ricky Ponting on Virat Kohli: ఇండియాకు వరల్డ్‌కప్‌ కోహ్లి ఒక్కడి వల్లే సాధ్యం: పాంటింగ్‌

Hari Prasad S HT Telugu

04 November 2022, 10:14 IST

    • Ricky Ponting on Virat Kohli: ఇండియాకు వరల్డ్‌కప్‌ తీసుకురావడం విరాట్‌ కోహ్లి ఒక్కడి వల్లే సాధ్యమవుతుందని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌. అతడు ఇలా ఆడటం కొనసాగిస్తేనే ట్రోఫీ గెలవగలరని అభిప్రాయపడ్డాడు.
రెండు కీలకమైన మ్యాచ్ లలో ఇండియాను గెలిపించిన విరాట్ కోహ్లి
రెండు కీలకమైన మ్యాచ్ లలో ఇండియాను గెలిపించిన విరాట్ కోహ్లి (ICC Twitter)

రెండు కీలకమైన మ్యాచ్ లలో ఇండియాను గెలిపించిన విరాట్ కోహ్లి

Ricky Ponting on Virat Kohli: టీ20 వరల్డ్‌కప్‌ను ఇండియా గెలవాలంటే విరాట్‌ కోహ్లి ఇలా బాగా ఆడటం కొనసాగించాల్సిందేనని అన్నాడు రికీ పాంటింగ్‌. ఆసియా కప్‌ నుంచి తన మునుపటి ఫామ్‌ అందుకున్న విరాట్.. ఈ వరల్డ్‌కప్‌లోనూ పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లపై విజయాలు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

"నేను కొన్ని నెలలుగా ఇదే విషయం చెబుతున్నాను. ఇంత పెద్ద టోర్నీ వస్తున్న సమయంలో విరాట్‌ కోహ్లిని టీమ్‌లోనే కొనసాగించాలని చెప్పాను. ఇలాంటి పెద్ద టోర్నీల్లో అనుభజ్ఞులైన స్టార్‌ ప్లేయర్స్ అవసరం. కీలకమైన సమయాల్లో వాళ్లే ఆదుకుంటారు. అది పాకిస్థాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే స్పష్టమైంది" అని పాంటింగ్‌ అన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఎంతో ఒత్తిడిలోనూ కోహ్లి 53 బాల్స్‌లోనే 82 రన్స్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో అసాధ్యమనుకున్న విజయం ఇండియాను వరించింది.

"మరే ప్లేయర్‌ ఉన్నా ఇండియాను గెలిపించేవాడని నేను అనుకోవడం లేదు. టీ20 క్రికెట్‌లో గతంలో ఇలాంటివి అన్నీ చూసిన అనుభవజ్ఞులైన ప్లేయర్స్‌ అవసరం. ఈ విషయంలో విరాట్‌ కోహ్లిని మించిన ప్లేయర్‌ ఇండియన్‌ క్రికెట్‌లో లేరు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చివరి 8 బంతుల్లో విరాట్‌ కోహ్లి స్ట్రైక్‌లో ఉన్నప్పుడు కూడా అతడు ఏదో అద్భుతం చేస్తాడనిపించింది" అని పాంటింగ్‌ స్పష్టం చేశాడు.

ఇప్పటి వరకూ ఇండియా తన బెస్ట్‌ క్రికెట్‌ ఆడలేదని కూడా ఈ సందర్భంగా పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. కోహ్లి ఒక్కడే మంచి క్రికెట్‌ ఆడుతున్నాడని అన్నాడు. "ఇండియా ఇప్పటి వరకూ అత్యుత్తమ క్రికెట్‌ ఆడలేదు. కానీ కోహ్లి మాత్రమే రెండు మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడాడు. ఇప్పుడతడు టోర్నీ హిస్టరీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఒకవేళ ఇండియా వరల్డ్‌ కప్‌ గెలవాలి అంటే మాత్రం విరాట్ కోహ్లి ఇలాగే ఆడటం కొనసాగించాల్సిందే" అని పాంటింగ్‌ తేల్చి చెప్పాడు.

ఆదివారం (నవంబర్‌ 6) ఇండియా తన సూపర్‌ 12 మ్యాచ్‌ జింబాబ్వేతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఇండియా నేరుగా సెమీఫైనల్‌ చేరుతుంది. మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయినా నష్టం లేదు. ఓడిపోతే మాత్రం సెమీస్‌ అవకాశాలు క్లిష్లమవుతాయి.

తదుపరి వ్యాసం