తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ponting Slams Rohit: ఇండియా ఆ ఉచ్చులో పడింది.. తొలి ఇన్నింగ్స్ కోసమే టీమ్ ఎంపిక చేసింది: పాంటింగ్ సెటైర్

Ponting slams Rohit: ఇండియా ఆ ఉచ్చులో పడింది.. తొలి ఇన్నింగ్స్ కోసమే టీమ్ ఎంపిక చేసింది: పాంటింగ్ సెటైర్

Hari Prasad S HT Telugu

08 June 2023, 7:37 IST

    • Ponting slams Rohit: ఇండియా ఆ ఉచ్చులో పడింది. తొలి ఇన్నింగ్స్ కోసమే టీమ్ ఎంపిక చేసింది అని పాంటింగ్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు మన బౌలర్లు తేలిపోయిన తర్వాత పాంటింగ్ తోపాటు దినేష్ కార్తీక్ కూడా విమర్శలు గుప్పించాడు.
ద్రవిడ్, రోహిత్ నిర్ణయాన్ని తప్పుబట్టిన పాంటింగ్
ద్రవిడ్, రోహిత్ నిర్ణయాన్ని తప్పుబట్టిన పాంటింగ్

ద్రవిడ్, రోహిత్ నిర్ణయాన్ని తప్పుబట్టిన పాంటింగ్

Ponting slams Rohit: డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు టీమిండియా బౌలర్లు తేలిపోయారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. తొలి రోజు మేఘావ్రుతమైన కండిషన్స్ ను మన బౌలర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇక సెలక్షన్ నిర్ణయాలు కూడా ఆశ్చర్యపరిచాయి. దీనిపైనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

టీమిండియా ఆ ఉచ్చులో పడిందని, కేవలం తొలి ఇన్నింగ్స్ కోసమే టీమ్ ఎంపిక చేసినట్లు ఉందని అనడం విశేషం. "ఈ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో వికెట్లు తీయడానికి మాత్రమే బౌలర్లను ఎంచుకోవాలన్న ట్రాప్ లో ఇండియా పడిపోయింది. జడేజా కంటే అశ్విన్ ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేసేవాడు.

ఆస్ట్రేలియా జట్టులో ఉన్న లెఫ్ట్ హ్యాండర్ల సంఖ్యను చూస్తే అశ్విన్ ను పక్కన పెట్టాలన్న నిర్ణయం నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్లు ఉమేష్ లేదా శార్దూల్ లలో ఒకరిని తీసుకోవాల్సింది. నేనైతే శార్దూల్ బెటర్ అని చెప్పగలను. అతడు స్ట్రైక్ బౌలర్లు షమి, సిరాజ్ లకు మంచి సపోర్ట్ ఇవ్వగలడు. జడేజా కేవలం ఏదో రెండు ఓవర్లు వేయడానికి మాత్రమే పనికి వస్తాడు" అని పాంటింగ్ అనడం గమనార్హం.

అశ్విన్ లెఫ్ట్ హ్యాండర్లకు బంతిని దూరంగా స్పిన్ చేయగలడని, నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్న ఆస్ట్రేలియా టీమ్ అతని బౌలింగ్ లో ఇబ్బంది పడేదని పాంటింగ్ స్పష్టం చేశాడు. ఇక ఇన్నింగ్స్ లో మొదట్లో టీమిండియా పేసర్లు ఎక్కువగా షార్ట్ బాల్స్ వేయడం కూడా తప్పిదమని పాంటింగ్ తోపాటు దినేష్ కార్తీక్ కూడా అభిప్రాయపడ్డాడు.

"షార్ట్ బాల్స్ ఎప్పుడూ బాగానే అనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం వికెట్లు తీయగలిగిన బాల్స్ అన్నీ 5 మీటర్ల మార్క్ లో వేయాల్సినవే" అని దినేష్ కార్తీక్ అన్నాడు. పాంటింగ్ ఈ అభిప్రాయంతో ఏకీభవించాడు. "ఒకవేళ ఇండియా బాగా బౌలింగ్ చేసిందని చెప్పాలంటే మొత్తం బంతుల్లో 60 శాతం ఫుల్లర్ డెలివరీలు, మరో 20 శాతం గుడ్ లెంత్ లో ఉండాల్సింది.

బ్యాటర్లు అప్పుడప్పుడు డ్రైవ్ ఆడతారన్న విషయాన్ని బౌలర్లు గుర్తుంచుకోవాలి. మిడాఫ్, మిడాన్ లను కాస్త దూరంగా వికెట్లకు కాస్త నేరుగా ఉంచితే బౌలర్లు ఫుల్లర్ లెంత్ బాల్స్ ను వేయగలిగేవారు" అని పాంటింగ్ అన్నాడు.

తదుపరి వ్యాసం