తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ponting On Ashes: ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా 5-0తో చిత్తు చేస్తుంది: ఆస్ట్రేలియా మాజీలు

Ponting on Ashes: ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా 5-0తో చిత్తు చేస్తుంది: ఆస్ట్రేలియా మాజీలు

Hari Prasad S HT Telugu

16 June 2023, 13:54 IST

    • Ponting on Ashes: ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా 5-0తో చిత్తు చేస్తుందని ఆస్ట్రేలియా మాజీలు అంచనా వేస్తుండటం విశేషం. యాసెష్ సిరీస్ కోసం బ్యాటింగ్ పిచ్ లు తయారు చేయాలన్న ఇంగ్లండ్ నిర్ణయంపై వాళ్లు ఈ కామెంట్స్ చేశారు.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్

Ponting on Ashes: క్రికెట్ లో అత్యుత్తమ సమరంగా భావించే యాషెస్ సిరీస్ శుక్రవారం (జూన్ 16) ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీలు రికీ పాంటింగ్, బ్రాడ్ హడిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ స్టైల్ టెస్ట్ క్రికెట్ కు అనుకూలించేలా ఫాస్ట్, ఫ్లాట్ పిచ్ లు తయారు చేస్తే బాగుంటుందని గతంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అయితే అలా చేస్తే ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా 5-0తో ఓడిస్తుందని ఆస్ట్రేలియా మాజీలు అనడం విశేషం. ఇంగ్లండ్ ఈ మధ్య కాలంలో బజ్‌బాల్ పేరుతో టెస్టుల్లోనూ వేగంగా బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్టైల్ కు అనుకూలంగా వికెట్లు ఉండాలన్నది స్టోక్స్ కోరిక. కానీ ఆస్ట్రేలియా మాజీలు పాంటింగ్, హడిన్ వాదన మాత్రం మరోలా ఉంది.

"ఒకవేళ ఇంగ్లండ్ కు ఫ్లాట్ వికెట్లు, చిన్న బౌండరీలు కావాలంటే అది వాళ్ల బౌలింగ్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. బ్రాడ్, ఆండర్సన్, రాబిన్సన్ లాంటి బౌలర్లు పిచ్ తమకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ అది జరగకపోతే వాళ్లు ఆస్ట్రేలియా బ్యాటర్లపై ఎంతమేర ప్రభావం చూపిస్తారో చూడాలి" అని పాంటింగ్ అన్నాడు.

ఇక దీనిపై హడిన్ స్పందిస్తూ.. "ఇంగ్లండ్ బ్యాట్ పైకి బంతి సులువుగా వచ్చే ఫాస్ట్, ఫ్లాట్ వికెట్లు కోరుకుంటోంది. ఇదే 5-0తో ఆస్ట్రేలియా గెలుస్తుందని చెప్పడానికి కారణం. అది జరగొచ్చు కూడా. ఒకవేళ ఇంగ్లండ్ కోరుకున్నట్లే పిచ్ లు ఉంటే మాత్రం ఆస్ట్రేలియా 5-0తో గెలుస్తుంది" అని స్పష్టం చేశాడు.

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండేళ్లకోసారి జరిగే ఐదు టెస్ట్ యాషెస్ సిరీస్ శుక్రవారం (జూన్ 16) నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ ఎడ్జ్‌బాస్టన్ లో జరగనుంది. ఈ టెస్టుకు ఇంగ్లండ్ లో కనిపించే ఫాస్ట్ పిచ్ ఉన్నట్లు గతంలో ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ చెప్పాడు.

తదుపరి వ్యాసం