తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wasim Akram On Bhuvneshwar Kumar: అతడి బౌలింగ్‌లో పేస్ లేదు.. టీమిండియా బౌలర్‌పై పాక్ మాజీ వ్యాఖ్యలు

Wasim Akram on Bhuvneshwar Kumar: అతడి బౌలింగ్‌లో పేస్ లేదు.. టీమిండియా బౌలర్‌పై పాక్ మాజీ వ్యాఖ్యలు

07 September 2022, 13:49 IST

    • Wasim Akram on Bhuvneshwar Kumar bowling: టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్‌పై పాక్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ సంచనల వ్యాఖ్యలు చేశాడు. అతడి బౌలింగ్‌లో పేస్ లేదని స్పష్టం చేశాడు.
భువనేశ్వర్ కుమార్
భువనేశ్వర్ కుమార్ (ICC Twitter)

భువనేశ్వర్ కుమార్

Wasim Akram on Bhuvneshwar Kumar bowling: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియా వరుసగా రెండు ఓటములతో ఫైనల్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. ఆదివారం నాడు పాకిస్థాన్‌తో జరిగిన మొదటి సూపర్ 4 మ్యాచ్‌లో ఓడిపోగా.. అనంతరం మంగళవారం నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం చెందింది. రెండింట్లోనూ చివరి ఓవర్ వరకు వచ్చి ఓటమి పాలైంది. పాక్‌తో మ్యాచ్‌లో 19వ ఓవర్లో 19 పరుగులు సమర్పించుకున్న టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్.. శ్రీలంకతో మ్యాచ్‌లోనూ 19వ ఓవర్లో 14 పరుగులు ఇవ్వడంతో భారత్‌కు విజయాలు దూరమయ్యాయి. భువి బౌలింగ్ ప్రదర్శనపై పలువురు మాజీలు కూడా విమర్శించారు. తాజాగా పాకిస్థాన్ మాజీ ప్లేయర్ వసీం అక్రమ్ కూడా భువి ఆటతీరుపై స్పందించాడు. అతడి బౌలింగ్‌లో పేస్ లేదని స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

"భువి చాలా మంచి బౌలర్. కానీ ఇలా అంటున్నందుకు నన్ను తప్పుగా అనుకోకండి. అతడి బౌలింగ్‌లో పేస్ లేదు. టీ20ల్లో బౌలర్లకు పేస్ లేకపోతే కష్టం. ముఖ్యంగా ఇలాంటి పిచ్‌ల్లో మీడియం పేసర్లకు(135 కిలోమీటర్ల లోపు వేగంతో వేసే బౌలర్) బదులు కనీసం గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే బుమ్రా లాంటి బౌలర్లు కావాలి. బుమ్రా జట్టులో ఉన్నట్లయితే.. బౌలింగ్ విభాగం బలంగా ఉంటుంది. అలాగే డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసేందుకు రెగ్యూలర్ బౌలర్లు కూడా కావాలి. అలా అని ఎవరోకరిని తీసుకోలేం. కాబట్టి ఒత్తిడికి అలవాటుకు పడకపోతే బౌలింగ్ చేయడం అసాధ్యం." అని వసీం అక్రమ్ స్పష్టం చేశాడు.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక.. టీమిండియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుశాల్ మెండిస్(57), పాథుమ్ నిశాంక(52) అర్ధశతకాలతో అదరగొట్టాగా.. కెప్టెన్ శనక(33) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీయగా.. అశ్విన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ విఫమైన వేళ.. రోహిత్ శర్మ(72) అర్ధశతకంతో రాణించాడు.

తదుపరి వ్యాసం