తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Manoj Tiwary Retires: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్

Manoj Tiwary Retires: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్

Hari Prasad S HT Telugu

03 August 2023, 13:36 IST

    • Manoj Tiwary Retires: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్ మనోజ్ తివారీ. ఈ టీమిండియా మాజీ క్రికెటర్ అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం (ఆగస్ట్ 3) వెల్లడించాడు.
మనోజ్ తివారీ
మనోజ్ తివారీ

మనోజ్ తివారీ

Manoj Tiwary Retires: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్న మనోజ్ తివారీ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 37 ఏళ్ల తివారీ చివరిసారి 2015లో ఇండియా తరఫున ఆడాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ కూడా అతడు దేశవాళీ క్రికెట్ ఆడటం విశేషం. బెంగాల్ లో మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ వచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

మనోజ్ తివారీ ఇండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 2008లో తొలిసారి బ్లూ జెర్సీలో కనిపించిన అతడు.. 2015 వరకూ మధ్య మధ్యలో టీమ్ లోకి వచ్చివెళ్తూ ఉన్నాడు. వన్డేల్లో ఒక సెంచరీ కూడా చేశాడు. 2021లో తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన తివారీ.. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. తర్వాత మమతా బెనర్జీ అతన్ని మంత్రి వర్గంలోకి తీసుకొని క్రీడా మంత్రిత్వ శాఖ అప్పగించారు.

తాజాగా గురువారం (ఆగస్ట్ 3) తన రిటైర్మెంట్ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేస్తూ ఓ పెద్ద థ్యాంక్యూ మెసేజ్ ను తివారీ రాశాడు. "క్రికెట్ కు గుడ్ బై. ఈ ఆట నాకు అన్నీ ఇచ్చింది. నేను కలలో కూడా ఊహించనివి కూడా క్రికెట్ నాకు ఇచ్చింది. ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కొంటున్న సమయం నుంచీ క్రికెట్ నాకు అండగా నిలిచింది. క్రికెట్ కు, ఆ దేవుడికి ఎప్పుడూ రుణపడి ఉంటాను" అని తివారీ తన పోస్టులో అన్నాడు.

బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్ లో మనోజ్ తివారీకి మంచి రికార్డు ఉంది. ఇక ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ పంజాబ్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ లాంటి టీమ్స్ తరఫున ఆడాడు. 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ లో తొలిసారి మనోజ్ తివారీ టీమిండియా తరఫున ఆడాడు. 2011లో యువరాజ్ స్థానంలో వెస్టిండీస్ టూర్ కు ఎంపికయ్యాడు.

వెస్టిండీస్ తో ఐదో వన్డేలో సెంచరీ చేసినా కూడా తర్వాత 14 మ్యాచ్ లపాటు అతడు జట్టుకు దూరంగానే ఉన్నాడు. టీ20 కెరీర్ కూడా అలాగే సాగింది. అయితే డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం తివారీ గొప్ప ప్లేయర్ గా నిలిచాడు. బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ అతడే. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక ట్రిపుల్ సెంచరీ, ఐదు డబుల్ సెంచరీలు చేశాడు.

తదుపరి వ్యాసం