తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు: ఈ వారం రాజకీయ నాయకులకి పదవీ యోగం

వార ఫలాలు: ఈ వారం రాజకీయ నాయకులకి పదవీ యోగం

HT Telugu Desk HT Telugu

28 January 2024, 2:00 IST

    • Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
ఈ వారం రాశి ఫలాలు(28.01.2024 నుంచి 03.02.2024)
ఈ వారం రాశి ఫలాలు(28.01.2024 నుంచి 03.02.2024)

ఈ వారం రాశి ఫలాలు(28.01.2024 నుంచి 03.02.2024)

రాశిఫలాలు (వార ఫలాలు) 28.01.2024 నుండి 03.02.2024 వరకు

లేటెస్ట్ ఫోటోలు

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : పుష్యం

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులపై ఒత్తిడులుంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు ముందుకు సాగవు. అనుకున్న ఆదాయం సమకూరక కొంత ఇబ్బంది తప్పదు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. వ్యాపారపరంగా స్వల్ప లాభాలున్నాయి. రాజకీయ నాయకులకు సమస్యలు ఎదురవుతాయి. శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. మేష రాశి వారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని , సుబ్రహ్మణ్యుడిని పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్ళు, వాహనాలు కొంటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు దక్కుతాయి. కుటుంబములో ఒత్తిడులుంటాయి. వృథా ఖర్చులుండును. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజు దుర్గాదేవిని పూజించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. రుణబాధలు తొలగి ఊరట లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వృథా ఖర్చులుండును. రాజకీయ నాయకులకు సన్మానాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి. ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొన్ని సమస్యలు వేధిస్తాయి. పట్టుదలతో అధిగమించి ముందుకు సాగుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. రాజకీయ నాయకులకు అనుకూల సమయం. మానసిక అశాంతి కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పరించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలముగా ఉంది. మీ ప్రతిభను చాటుకుంటారు. కొత్త విషయాలు తెలుస్తాయి. మీ అభిప్రాయాలు కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. ఆదాయం గతంతో పోల్చుకుంటే మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలుండును. ఉద్యోగులకు ఉన్నతమైన పదవులు లభిస్తాయి. రాజకీయ నాయకులకు సంతోషకరమైన సమాచారం. ఖర్చులుండును. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యా రాశి

కన్యారాశి వారికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. అదనపు రాబడి దక్కిఉత్సాహంగా గడుపుతారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలీకృతమవుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సత్కారాలు. కుటుంబ సమస్యలు ఖర్చులుండును. మహా విష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వాహనాలు, భూములు కొంటారు. అత్యంత ముఖ్య ఆహ్వానం అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్ధితి దక్కుతుంది. రాజకీయ నాయకుల కృషి ఫలిస్తుంది. అనారోగ్య సమస్యలుండును. ధన వ్యయం. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. మీ సమర్థత, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం. రాజకీయ నాయకులకు పదవీయోగం. శ్రమ తప్పదు. గురు దక్షిణామూర్తిని పూజించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. పనులు ఆలస్యమవుతాయి. ఆర్థిక పరమైన సమస్యలు తీరతాయి. మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనయోగముంది. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం. పారిశ్రామిక వేత్తలకు సన్మానాలు. ధన వ్యయం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు పదవులు పెరిగే అవకాశాలు. గతలోని కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రముఖులు పరిచయమవుతారు. స్తిరాస్థి వివాదాలు పరిష్కారమవుతాయి. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వాహనాలు కొంటారు. కళాకారులు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి పొందుతారు. ఆరోగ్య సమస్యలుంటాయి. సోదరులతో విఖేదాలు. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఎటువంటి సమస్యనైనా తేలికగా పరిష్కరించుకుంటారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలుగుతాయి. పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. ఖర్చులు తప్పవు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థంగా ఉంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహన యోగం ఉంది. చర్చలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు సత్మారాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. పనులు కొంత నెమ్మదించినా పూర్తి కాగలవు. నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం