తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Weekly Horoscope: ఈవారం రాశి ఫలాలు.. కుటుంబ సభ్యులతో వాదనలు ఈ రాశి వారిని ఇబ్బందిపెడతాయి

Weekly Horoscope: ఈవారం రాశి ఫలాలు.. కుటుంబ సభ్యులతో వాదనలు ఈ రాశి వారిని ఇబ్బందిపెడతాయి

HT Telugu Desk HT Telugu

17 December 2023, 5:04 IST

    • Weekly Horoscope: ఈవారం రాశి ఫలాలు పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. 17 డిసెంబరు 2023 నుంచి 23 డిసెంబరు 2023 వరకు గల వారానికి వార ఫలాలు ఇక్కడ తెలుసుకోగలరు.
Weekly Horoscope: ఈవారం రాశి ఫలాలు
Weekly Horoscope: ఈవారం రాశి ఫలాలు (Pixabay)

Weekly Horoscope: ఈవారం రాశి ఫలాలు

ఈ వారం రాశి ఫలాలు(వార ఫలాలు)

లేటెస్ట్ ఫోటోలు

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

17. 12.2023 నుండి 23.12.2023 వరకు

మాసం: మార్గశిరం, సంవత్సరం: శోభకృత్‌ నామ

మేషరాశి

మేషరాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అష్టమ కుజుడు మరియు జన్మగురుడి ప్రభావం వలన ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించడం మంచిది. లాభములో శని అనుకూలంగా ఉన్నప్పటికి కుజ, గురుల ప్రభావం వలన పనులలో చికాకులు కలుగును. ఈవారం మేషరాశికి భాగ్యస్థానములో రవి, బుధుల అనుకూల ప్రభావం వలన గత కొన్ని రోజులతో పోల్చి చూసుకుంటే ఈవారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు సంభవించును. ఉద్యోగస్తులకు ఈవారం రాజకీయ ఒత్తిళ్ళు కొంత ఇబ్బందిపెట్టేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈవారం అన్ని విధాలుగా అనుకూలించును. రైతాంగం సినీరంగం వారికి ఈవారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. మేషరాశివారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్జి పూజించినట్లయితే మరింత శుఖభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ధన నష్టము, ఖర్చులు అధికముగా గోచరించుచున్నవి. అష్టమ స్థానములో రవి, బుధుల ప్రభావం వలన వారం అనారోగ్య సమస్యలు, ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. కుటుంబ వ్యవహారంపరంగా ఆరోగ్య విషయాలపరంగా ఈవారం జాగ్రత్తలు వహించాలి. కళత్రస్థానములో కుజుని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో వాదనలు ఏర్పడు సూచన కనబడుచున్నది. మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడుకున్నటువంటి వారం. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారంరోజు దుర్గాదేవిని పూజించాలి.

మిథునరాశి

మిథునరాశి జాతకుల వార ఫలాలు అనుకూలంగా ఉన్నవి. దశమంలో రాహువు, లాభములో గురుడు అనుకూలించడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈవారం కొంత పురోగతి కనిపించును. శత్రు స్థానములో కుజుని సంచారం వలన ఉద్యోగస్తులకు శత్రుబాధలు కొంత అధికముగా ఉ ౦డును. కళత్రస్థానములో రవి సంచారం వలన జీవిత భాగస్వామితో భేదాభిప్రాయములు కలుగు సూచన. దశమంలో రాహువు, భాగ్యములో శని ప్రభావంచేత ఈవారం అనుకూల మరియు సత్‌ ఫలిత సూచనలు కనబడుచున్నవి. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. మిథునరాశి వారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం వార ఫలాలు మధ్యస్థముగా ఉన్నవి. అష్టమశని ప్రభావంచేత ఆనారోగ్య సమస్యలు, ఇబ్బందులు వేధించును. కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలని సూచన. భాగ్యములో రాహువు, దశమంలో కేతువు అనుకూలతల వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో రాణించినప్పటికి రాజకీయ ఒత్తిళ్ళు కలుగును. చతుర్ధ స్థానములో శుక్రుని అనుకూలత వలన కుటుంబ సౌఖ్యము, ఆదరణ మరియు అనందము కలుగును. పంచమంలో కుజుని యొక్క ప్రభావంచేత సంతానం వలన శుభవార్తను వింటారు. కర్కాటక రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహరాశి

సింహరాశి వారికి ఈవారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వాక్‌ స్థానములో కేతువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచన. భ్రాతృ వర్గీయంతో ఆనందము పొందెదరు. చతుర్ధ స్థానములో కుజుని ప్రభావంచేత కుటుంబములో కొన్ని సమస్యలు కలచివేయును. పంచమంలో రవి, బుధుల ప్రభావం వలన సంతానం వల్ల ఆనందము పొందెదరు. సింహరాశి వారు అష్టమ రాహువు ప్రభావంచేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలని సూచన. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈవారం అనుకూలంగా ఉన్నది. సింహరాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ వారం ధనలాభము కలుగును. స్త్రీ సౌఖ్యం, ఆనందము పొందెదరు. ధనస్థానము మరియు కుటుంబ స్థానములో శుక్రుని ప్రభావంచేత కుటుంబ సౌఖ్యం, ఆనందము పొందెదరు. ధనపరమైనటువంటి సమస్యల నుండి బయటపడెదరు. వ్యాపారస్తులకు ఈవారం అన్ని విధాలుగా అనుకూలించును. తృతీయంలో కుజుని ప్రభావం వలన భ్రాతృ వర్గంతో ఆనందముగా గడిపెదరు. అష్టమగురుని ప్రభావం వలన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. కళత్రంలో రాహువు ప్రభావం వలన కుటుంబ సభ్యులతో వాదనలు కొంత ఇబ్బందిపెట్టు సూచన. వృత్తి ఉద్యోగ వ్యాపాపరపరంగా అనుకూలంగా ఉన్నది. కన్యారాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. జన్మరాశిలో శుక్రుని ప్రభావంచేత శారీరక సౌఖ్యం ఆనందము పొందెదరు. పంచమంలో శని, ఆరో ఇంట్లో రాహువు అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అభివృద్ధి కలుగును. వాక్‌ స్థానములో కుజుని ప్రభావం వలన గొడవలకు, అవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. కళత్ర స్థానములో గురుని యొక్క అనుకూల ప్రభావం చేత జీవిత భాగస్వామితో అనందముగా గడిపెదరు. గత కొంతకాలంతో పోల్చుకుంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని తెలియచేస్తున్నాను. ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృళ్చిక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. జన్మరాశిలో కుజుని ప్రభావం వలన శారీరక శమ, పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అర్ధాష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యయస్థానములో శుక్రుని ప్రభావం వలన ఇష్టమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. వాక్‌ స్థానములో రవి ప్రభావం చేత ఘర్షణలకు దూరంగా ఉండాలని సూచన. కోపముతో నిర్ణయాలు తీసుకోకూడదు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈవారం ఉద్యోగపరంగా ఒత్తిళ్ళు, ఆరోగ్యపరంగా సమస్యలు వ్యాపారపరంగా ఖర్చులతో కూడి ఉన్న వారమని సూచిస్తున్నాను. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించండి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. తృతీయంలో శని, పంచమంలో గురుడు అనుకూలంగా ఉన్నప్పటికి ఈవారం జన్మరాశిలో రవి, బుధుల సంచారం వలన పనుల యందు చికాకులు, ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. వ్యయస్థానంలో కుజుని ప్రభావం వలన ఘర్షణ వాతావరణములు ఏర్పడును. అనుకోని ఇబ్బందులు, సమస్యలు, గొడవలు ఈవారం మిమ్మల్ని కలచివేయు సూచన. శని, గురు గ్రహాల అనుకూలత వలన ఏ సమస్యలు కలిగినప్పటికి మీయొక్క మనోధైర్యంతో వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగెదరు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఈవారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనూరాశి వారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. తృతీయంలో రాహువు అనుకూలంగా ఉండటం, చతుర్ధంలో గురుడు అనుకూలంగా వ్యవహరించడం వలన కుటుంబ సౌఖ్యం, అనందము పొందెదరు. దశమంలో శక్రుడు, లాభములో కుజుని ప్రభావం వలన ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కనబడును. వ్యాపారస్తులకు వ్యాపారం లాభదాయకముగా ఉండును. ఏలినాటి శని అంత్యభాగము వ్యయస్థానములో రవి, బుధుల ప్రభావం వలన ధనపరమైనటువంటి విషయాలలో మకరరాశి వారికి ఈవారం ఖర్చులు అధికముగా గోచరిస్తున్నవి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఖర్చుల పరమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ స్ట ఫలితాలు ఉన్నాయి. జన్మశని ప్రభావం ఏలినాటి శని ప్రభావంవలన పనుల యందు ఆలస్యము, చికాకులు ఇబ్బందిపెట్టును. వాక్‌ స్థానములో రాహువు ప్రభావం వలన అవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. లాభములో రవి, కుజుల ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈవారం కొంత పురోగతి కనిపించును. దశమంలో కుజుడు అనుకూలించడం వలన ఉద్యోగస్తులకు అనుకూలమైన ఫలము లభించును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం ఫలించును. భాగ్యంలో శుక్రుడు అనుకూల ప్రభావం చేత సౌఖ్యము, ఆనందము పొందెదరు. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వలన కుటుంబ సమస్యలు చికాకులు వేధించును. అరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాలయందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. అష్టమ శుక్రుని ప్రభావంచేత అరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్ధితి గోచరిస్తుంది. భాగ్యంలో కుజుడు, దశమంలో రవి, బుధులు అనుకూలత వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. అప్పు చేయవద్దు. అలాగే అప్పు ఇవ్వద్దు అని సూచన. మొత్తం మీద మీనరాశి వారికి ఈవారం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. గురు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలని సూచన. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషే కం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

తదుపరి వ్యాసం