తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు.. ఈ రాశుల జాతకులు ఖర్చులు తగ్గించుకుంటే మంచిది

వార ఫలాలు.. ఈ రాశుల జాతకులు ఖర్చులు తగ్గించుకుంటే మంచిది

HT Telugu Desk HT Telugu

04 February 2024, 2:00 IST

    • Weekly horoscope in telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
ఈ వారం రాశి ఫలాలు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు
ఈ వారం రాశి ఫలాలు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు (freepik)

ఈ వారం రాశి ఫలాలు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు

రాశిఫలాలు (వార ఫలాలు) 04.02.2024 నుండి 10.02.2024 వరకు

లేటెస్ట్ ఫోటోలు

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : పుష్యం

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగపరంగా మధ్యస్థ ఫలితాలున్నాయి. ఖర్చులు ఆదాయాన్ని మించుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన బాధ్యతలు ఉత్సాహపరచగలవు. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసిరావచ్చును. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మేష రాశి వారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుడిని పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థం నుండి అనుకూలం. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పట్టుదలతో పనులు చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం పనికిరాదు. విద్యార్థులకు కష్టపడవలసిన సమయం. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజు దుర్గాదేవిని పూజించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. సమయానుసారంగా వృత్తి ఉద్యోగాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు, అవివాహితులకు ప్రయోజనాలు ఏర్పడతాయి. ఖర్చులు ఆదాయాల్ని మించుతాయి. అనారోగ్య సమస్యలున్నా ఆనందంగా ఉంటారు. కనకధారా స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. అధికారిక కార్యక్రమాలలో పాల్గొనగలరు. సహాయకులతో వ్యవహారాలను చర్చించకండి. అనుకున్న ఆదాయాలు ఆలస్యంగానైనా చేతికందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి ప్రయోజనాలుంటాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలముగా లేదు. బంధువుల నుండి విమర్శలను ఎదుర్మోవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలుంటాయి. నూతన వ్యాపారాలకు కావలసిన ఒప్పందాలు చేసుకోగలుగుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. విద్యార్థులకు మధ్యస్థ సమయం. స్త్రీలకు కుటుంబ సమస్యలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగును. సింహ రాశివారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపరంపరంగా సామాన్య ఫలితాలుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. విద్యార్థులు టార్గెట్‌ విధానాలను పాటించుకోవాలి. తప్పును ఒప్పుకోలేకపోతారు. కొన్ని విషయాలలో ఏమీ చేయలేని పరిస్థితి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సమస్యలు వేధించును. మహా విష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేస్తున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తులను, పెద్దలను కలుసుకుంటారు. గతంలో రానిబకాయిలపై దృష్టి పెడతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. స్త్రీలకు కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు ఇబ్బందిపెట్టును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అవసరాలకు సరిపడు ఆదాయాలుంటాయి. వ్యక్తిగత వ్యవహారాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రులతో లౌక్యంగా వ్యవహరిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఆరోగ్యవిషయాల్లో శ్రద్ద వహించాలి. గురు దక్షిణామూర్తిని పూజించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పరించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. నూతన అవకాశాలు కలసివస్తాయి. నూతన ఆదాయ మార్తాలపై ఆసక్తి ఏర్పడగలదు. నిరుద్యోగులకు ఆశయసిద్ధి. స్థిరాస్తుల్ని సొంతం చేసుకోగలుతారు. ప్రయాణాలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. అరోగ్యం అనుకూలించును. ధనూ రాశి వారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రభావాలకు లోనవుతారు. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సాధారణ ఫలితాలుంటాయి. స్పెక్యులేషన్‌లకు, పెట్టుబడులకు దూరంగా ఉండండి. విద్యార్థులకు మధ్యస్థ సమయం. అరోగ్య సమస్యలుండును. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఊహించని విధంగా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కుటుంబములో నూతన వ్యక్తులు రాకలుంటాయి. అంచనా వ్యాపారాలకు దూరంగా ఉంటూ వ్యవహరించుకోవాలి. ఆదనపు బాధ్యతలు ఉద్యోగులకు ఏర్పడినా ఉత్సాహంగా పూర్తిచేస్తారు. సోదరమైత్రి ఏర్పడుతుంది. విద్యార్థులు టార్గెట్‌ విధానములు పాటించుకోవాలి. కుంభ రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థముగా ఉంది. అవగాహన ఉన్న పనులను చేపట్టుకొని పూర్తి చేసుకోవాలి. నిర్మాణపు పనులు వేగంగా పూర్తి కాగలవు. ఉద్యోగాల్లో చిన్నతరహా గుర్తింపు ఏర్పరుచుకోగలుగుతారు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలకు కుటుంబసమస్యలు ఆర్థిక సమస్యలు ఇబ్బందిపెట్టును. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం