తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు: ఈ వారం ఈ రాశి వాళ్ళు అద్భుత అవకాశం కోల్పోతారు

వార ఫలాలు: ఈ వారం ఈ రాశి వాళ్ళు అద్భుత అవకాశం కోల్పోతారు

Gunti Soundarya HT Telugu

07 January 2024, 2:00 IST

    • Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. జనవరి 7 నుంచి 13 వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
ఈ వారం రాశి ఫలాలు(07.01.2024 నుంచి 13.01.2024)
ఈ వారం రాశి ఫలాలు(07.01.2024 నుంచి 13.01.2024) (freepik)

ఈ వారం రాశి ఫలాలు(07.01.2024 నుంచి 13.01.2024)

రాశిఫలాలు (వార ఫలాలు) 07.01.2024 నుండి 13.01.2024 వరకు

లేటెస్ట్ ఫోటోలు

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

Mercury transit: వీరి మీద కనక వర్షం కురిపించబోతున్న బుధుడు.. అందులో మీరు ఉన్నారా?

May 16, 2024, 01:34 PM

సంవత్సరం : శోభకృత్‌ నామ

అయనం : దక్షిణాయనం

మాసం : మార్గశిరం

మేషరాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. సన్నిహితులతో గొడవలు పడకుండా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్చ అనారోగ్య బాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. మేష రాశి వారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించినట్లయితే శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశముంది. అశుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనష్టం. వృషభ రాశివారు ఈ వారం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారంరోజు దుర్గాదేవిని పూజించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. నూతన కార్యాలయాలను ప్రారంభిస్తారు. రుణవిముక్తి లభిస్తుంది. మానసికంగా ఆనందముగా గడుపుతారు. ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం అంతగా కలిసి రాలేదు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి . ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. విందులు, వినోదాలకు దూరంగా ఉండుట మంచిది. కుటుంబంలో మార్పుని కోరుకుంటారు. మానసిక ఆందోళన కలుగుతుంది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం అనుకూలంగా ఉన్నది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాలలో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. అకస్మిక ధనలాభంలో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. స్త్రీలు, బంధుమిత్రులను కలుస్తారు. విదేశీయాన ప్రయత్నం నెరవేరుతుంది. సింహ రాశివారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వర స్వామిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబములో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశముంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అలస్యంగా లభిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు ఆనందాన్నిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి. మహా విష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాగ్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అరోగ్యం అనుకూలించును. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని, సంకట నాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో కలసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశముంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. గురుదక్షిణామూర్తిని పూజించడం మంచిది. లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించండి.

ధనుస్సు రాశి

ధనూ రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. అకాలభోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం అనుకూలించును. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యవసాయ పరంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. ధనూ రాశివారు శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం, శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళరాదు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణబాధలు తొలగును. ఆరోగ్యం మెరగవుతుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. సోదరులతో భేదాభిప్రాయం రాకుండా జాగ్రత్త వహించాలి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం చేయడం, దశరథ్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. చిన్న మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధన లాభముంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. స్థిరాస్తులకు సంభించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. కుంభ రాశివారు మరిన్నిశుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశముంది. అపకీర్తి రాకుండా జాగ్రత్తపడుట మంచిది. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసికాందోళన తప్పదు. నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించి, లలితా సహస్ర నామాన్ని పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం