తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Surya Grahanam 2022 । సూర్య గ్రహణం వెనక ఉన్న కథ, చెడు ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Surya Grahanam 2022 । సూర్య గ్రహణం వెనక ఉన్న కథ, చెడు ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

HT Telugu Desk HT Telugu

25 October 2022, 9:14 IST

    • Surya Grahanam 2022: సూర్య గ్రహణం (Solar Eclipse 2022) ఈరోజు మధ్యాహ్నం నుంచి సంభవిస్తుంది. గ్రహణ ప్రారంభ, ముగింపు సమయాలు. అలాగే ఈ సమయంలో చెడు ప్రభావం మనపై పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Surya Grahanam 2022
Surya Grahanam 2022 (Pixabay)

Surya Grahanam 2022

Surya Grahanam 2022: హిందూ పంచాంగంలో కార్తీక మాసానికి, కార్తీక అమావాస్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలో కార్తీక అమావాస్య వస్తుంది. ఈ ఏడాది కార్తీక అమావాస్య నాడు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది.

లేటెస్ట్ ఫోటోలు

మే 11, రేపటి రాశి ఫలాలు.. రేపటితో వీరికి డబ్బు సమస్యకు తెరపడబోతుంది

May 10, 2024, 08:20 PM

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఏం కొనాలో తెలుసుకోండి.. ఇవి కొంటె మీ లైఫ్ మారిపోతుంది

May 10, 2024, 10:38 AM

Lord Shiva: పరమేశ్వరుడికి ప్రియమైన రాశులు ఇవే.. వీరికి ఎప్పుడు శివయ్య అనుగ్రహంతో విజయం తథ్యం

May 10, 2024, 10:15 AM

ఇది శని భగవానుడు ఇస్తున్న రాజ యోగం.. ఈ రాశులకు డబ్బు, జీవితంలో ప్రశాంతత!

May 10, 2024, 06:00 AM

మే 10, రేపటి రాశి ఫలాలు.. అక్షయ తృతీయ రోజు ఎవరికి ఎలా గడుస్తుందో చూసేయండి

May 09, 2024, 08:20 PM

Kubera Favorite Rasis: కుబేరుడి ఫేవరెట్ రాశులు ఇవే.. డబ్బు కష్టాలే ఉండవు వీరికి

May 09, 2024, 05:19 PM

ఈ సారి సూర్యుడు తులారాశిలో (సూర్యభగవానుని బలహీనమైన రాశిలో) సంచరిస్తున్నందున ఈ సూర్యగ్రహణం అందరికీ అనుకూలంగా ఉండదు. అలాగే మంగళవారం సూర్యగ్రహణం సంభవిస్తున్నందున, ఇది ఏమంత మంగళకరమైనది కాదు, ప్రజలపై చెడు ప్రభావం ఉంటుందని పంచాగకర్తలు చెబుతున్నారు.

అయితే ఈ సూర్యగ్రహణం సమయంలో, సూర్యుని ధ్యానం చేయడం వల్ల సూర్యుని శక్తులు బలపడతాయి. తద్వారా అందరికీ మేలు కలుగుతుంది, ఎందుకంటే సూర్యుడు అందరికీ తండ్రి, శక్తికి కారక గ్రహం కావున సూర్యగ్రహణం రోజున సూర్య మంత్రాన్ని పఠించడం, యోగా, ధ్యానం చేయడం మంచిదని సూచిస్తున్నారు.

సూర్య గ్రహణ సమయంలో నిద్రించడం మంచిది కాదు, గర్భిణీలు సూర్యుని వైపు చూడటం, బయటకు వెళ్లటం శుభసూచకం కాదు.

Surya Grahanam Mantra- మంత్ర జపం చేస్తూ ఉండాలి

ఓం నమః శివాయ అంటూ శివనామస్మరణ చేయాలి. అలాగే హనుమాన్ చాలీసా పఠించవచ్చు.

సూర్యగ్రహణం రోజున ఈ మంత్ర జపం చేస్తూ ఉండాలి.

ఓం త్రయంభకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్ ।

ఉర్వారుక్మివ్ బంధనన్ మృత్యోర్ ముక్షీయ మమృతాత్..॥

Surya Grahanam Story- సూర్యగ్రహణం వెనక ఉన్న కథ

హిందూ గ్రంధాల ప్రకారం, క్షీరసాగర మదన సమయంలో అమృతం బయటకు వచ్చినపుడు ఆ అమృతం రాక్షసులకు దక్కకుండా మహా విష్ణువు అప్సరస రూపంలో మారి, రాక్షసులను పక్కదారి పట్టించి దేవతలకు అమృతం పంచడం ప్రారంభించాడు. అదే సమయంలో స్వర్భానుడనే రాక్షసుడు అమృతాన్ని పొందడం కోసం దేవతల వర్గంలో కలిసిపోతాడు. ఆ విధంగా స్వర్భానుడు కూడా అమృతాన్ని సేవిస్తాడు.

ఈ విషయాన్ని సూర్యుడు, చంద్రుడు కలిసి మహా విష్ణువుకి తెలియపరుస్తారు. దీంతో విష్ణువు తన సుదర్శన చక్రంతో స్వర్భానుడి శిరస్సును ఛేదిస్తాడు. అయితే స్వర్భానుడు శిరస్సు తెగిపడినా అప్పటికే అమృతం తాగి ఉండటంతో ప్రాణం పోదు కానీ దేహం రెండు ముక్కలవుతుంది. తల భాగానికి రాహువు అని, మిగిలిన భాగానికి కేతువు అని పేరు పెట్టారు. అయితే అప్పటి నుండి తన ఈ పరిస్థితికి కారణమైన సూర్యచంద్రులకు, రాహువు-కేతువులు శత్రువులుగా మారారు. అప్పట్నించి సూర్యచంద్రులను గ్రహణం చేయడం ప్రారంభించారు. ఈ విధంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లాంటివి ఏర్పడుతున్నాయి. ఆ సమయంలో దేవతల శక్తి సన్నగిల్లుతుంది, అవి శుభ,అశుభ ఫలితాలను మారుస్తాయని నమ్ముతారు.

Surya Grahanam 2022 Details

అక్టోబర్ 25, 2022న కార్తీక అమావాస్య 2022 రోజున సూర్యగ్రహణం సంభవిస్తుంది. భారతదేశంలో సూర్య గ్రహణం 2022 ఏర్పడే సమయం ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉంది.

సూతక్ ప్రారంభం - 25 అక్టోబర్, 2022 - 03:17 AM

సూతక్ ముగింపు - 25 అక్టోబర్, 2022 - 05:42 PM

గ్రహణం ప్రారంభమయ్యే సమయం - 25 అక్టోబర్, 2022 - 2:29 PM

గ్రహణ మధ్య సమయం - 25 అక్టోబర్, 2022 - 04:30 PM

గ్రహణ ముగింపు సమయం - 25 అక్టోబర్, 2022 - 06:32 PM

సూర్యగ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి. దానధర్మాలు చేస్తే మంచిదని పండితులు పేర్కొన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం