Sunday Surya Mantras: ఆదివారం రోజు ఈ సూర్య మంత్రాలు జపిస్తే.. సకలం శుభకరం!
ఉదయాన్నే లేచి సకల జీవాలకు కనిపించే దేవుడైన సూర్య భగవానుడ్ని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆదివారం సూర్య భగవానుడి మంత్రాలు జపించడం వలన నలుదిక్కుల నుంచి కీర్తి, అదృష్టం, ఐశ్యర్యం సిద్ధిస్తాయని ధార్మిక శాస్త్రాలలో ఉంది. ఆ మంత్రాలు ఇక్కడ చూడండి.
ధార్మిక శాస్త్రాల ప్రకారం దేవదేవతలందరిలో సూర్యుడుకి గొప్ప స్థానం ఉంటుంది. ఆది పంచ దేవతలుగా వినాయకుడు, శక్తి, శివుడు, విష్ణువుల తర్వాత సూర్య భగవానునికి స్థానం లభించింది. అందుకే సూర్యుడిని ఆదిత్యుడుగా పిలుస్తారు. సూర్యుడు మానవాళికి ప్రత్యక్షంగా కనిపించే దేవుడు. సూర్యుని వలనే గ్రహాల కదలిక, సూర్య కాంతితోనే జీవులు జీవాన్ని పొందుతాయి.
జ్యోతిషశాస్త్రంలో సూర్యుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తొమ్మిది గ్రహాలలో సూర్యుడు మొదటి గ్రహం, సూర్యుని సంచారంతో గ్రహఫలాలు మారుతుంటాయి. ఆదివారం సూర్య భగవానుని ఆరాధనకు ప్రత్యేక దినంగా పరిగణిస్తారు. ప్రతీ ఆదివారం ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజ చేస్తున్న సమయంలో ఆదిత్య మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తులకు వారి జీవితంలో గ్రహపీడలు తొలగి సంతోషం, సౌభాగ్యం, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.
అదేవిధంగా పితృకర్మలకు సైతం సూర్యుడే అధిపతి. కాబట్టి తండ్రిని గౌరవించడం వల మీ జాతకంలో ఆదిత్యుడు బలపడతాడు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే నలుదిక్కుల నుంచి శక్తి లభిస్తుంది. సూర్య స్థానం బలహీనంగా ఉన్నవారి జాతకంలో తండ్రీకొడుకుల మధ్య చీలికలు ఏర్పడతాయి. హైబీపీ, ఎముకల బలహీనత, గుండె సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి. సమాజంలో గౌరవం ఉండదు, ఎంత చేసినా కీర్తి మసకబారుతుంది. కాబట్టి జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి. ఇందుకోసం తండ్రిని గౌరవిస్తూనే సూర్య భగవానుడ్ని ఆరాధించాలి. ఏ విధమైన గౌరవం లేదా అవమానాల కారకం కూడా సూర్యభగవానుడే. అందుకే ప్రతి వ్యక్తి సూర్యభగవానుని నిండు విధేయతతో, భక్తితో పూజించడం చాలా అవసరం. అప్పుడే సూర్యభగవానుడు ప్రసన్నం అవుతాడు.
ఆదిత్య మంత్రం
ప్రతిరోజూ సూర్య భగవానుడిని పూజించాలి. ఆదివారం ఉదయం వేకువజామున నిద్రలేచిన వెంటనే ఉదయిస్తున్న సూర్యుని నమస్కరిస్తూ “ ఓం సూర్యాయ నమః ” అంటూ ఈ మంత్రాన్ని జపించాలి. మీ ఆలోచనలు మొదలయ్యే సమయంలోనూ ఈ సూర్యమంత్రాన్ని జపించవచ్చు.
Surya Mantra:
నమః సూర్య శాన్తాయ సర్వరోగ నివారిణే
ఆయు రారోగ్య మైశ్వైర్యం దేహి దేవః జగత్పత్తే ||
సూర్య భగవానుని వేద మంత్రం
ఓం ఆ కృష్ణేన్ రజసా వర్తమానో నివేశ్యన్ అమృతం మర్త్యణ్చ్
హిరణ్యేన్ సవితా రథేన దేవో యాతి భువనాని పశ్యన్ ॥
సూర్య గాయత్రీ మంత్రం
ఓం ఆదిత్య విద్మహే ప్రభాకరై ధీమ్హితాన్నః సూర్య ప్రచోదయాత్.
ఓం సప్తురంగయ విద్మహే సహస్త్రకిరణాయ ధీమహి తన్నో రవి: ప్రచోదయాత్.
'ఓ సూర్యా! సహస్రాంశో తేజోరాశీ జగపతే ।
కరుణాకరే దేవ్ గృహాణాధ్య నమోస్తుతే.
సూర్య గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల ఆత్మశుద్ధి, ఆత్మగౌరవం, మనశ్శాంతి లభిస్తాయి. మనిషికి వచ్చే కష్టాలు దూరమవుతాయి.
సంబంధిత కథనం
టాపిక్