తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Moon Eclipse 2024: హోలీ రోజునే చంద్రగ్రహణం.. ఈ ఐదు రాశుల జాతకులు జాగ్రత్తగా ఉండాలి

Moon eclipse 2024: హోలీ రోజునే చంద్రగ్రహణం.. ఈ ఐదు రాశుల జాతకులు జాగ్రత్తగా ఉండాలి

Gunti Soundarya HT Telugu

06 February 2024, 16:10 IST

    • Moon eclipse 2024: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం హోలీ పండగ రోజున ఏర్పడబోతుంది. దీని ప్రభావం మేష రాశి సహా ఐదు రాశుల జాతకులపై పడనుండడంతో వీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ జాబితాలో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి. 
చంద్రగ్రహణం 2024
చంద్రగ్రహణం 2024 (pixabay)

చంద్రగ్రహణం 2024

Moon eclipse 2024: సనాతన ధర్మంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షం పౌర్ణమి రోజు రాత్రి హోలీకా దహన్ నిర్వహిస్తారు. మరుసటి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వరకు అందరూ రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడుపుతారు. సోదర భావం, పరస్పర ప్రేమ, సుహృద్భావానికి చిహ్నంగా ఈ పండుగని భావిస్తారు.

లేటెస్ట్ ఫోటోలు

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 25న వచ్చింది. అయితే పంచాంగం ప్రకారం అదే రోజు తొలి చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ చంద్ర గ్రహణం మార్చి 25 న ఉదయం 10.23 గంటల నుంచి మధ్యాహ్నం 3.02 గంటల వరకు ఉంటుంది. కాగా, ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించదు. అందుకే సూతక్ కాల ప్రభావం కూడా ఉండదు. కానీ ఈ చంద్రగ్రహణ ప్రభావం మాత్రం కొన్ని రాశుల మీద పడబోతుంది.

జ్యోతిష్యశాస్త్ర లెక్కల ప్రకారం ఈ సంవత్సరంలో వచ్చే మొదటి చంద్రగ్రహణం ప్రభావం కొన్ని రాశుల జీవితంలో అవాంతరాలు కలిగించబోతుంది. ఈ ప్రభావం పడకుండా ఉండటం కోసం ఈ రాశుల వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఈ రాశుల వారు చంద్రగ్రహణం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రాశులు ఏవంటే..

మేష రాశి

ఈ ఏడాది ఏర్పడనున్న మొదటి చంద్రగ్రహణ ప్రభావం మేష రాశి వారికి అశుభ ప్రయోజనాలు ఇవ్వబోతుంది. ధనానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మితిమీరిన ఖర్చుల వల్ల మనసు కలత చెందుతుంది. ఆర్థిక విషయాల్లో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. తెలివిగా డబ్బు ఖర్చు చేస్తారు.

మకర రాశి

చంద్రగ్రహణం ప్రభావం మకర రాశి వారికి శుభప్రదంగా పరిగణించబడదు. కొన్ని విషయాల వల్ల మనసు కలత చెందుతుంది. తెలియని భయం వెంటాడుతుంది. ఆందోళనగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అర్థం లేని చర్చలకు దూరంగా ఉండటం మంచిది.

కన్యా రాశి

చంద్రగ్రహణం వల్ల కన్యా రాశి వారు సమస్యల్లో పడతారు. వైవాహిక జీవితంలో సమస్యలు అధికమవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సంతోషం, శాంతి ఉండేలా చూసుకోండి. అనవసరంగా మీ భాగస్వామితో గొడవ పడొద్దు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి గ్రహణం వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. మానసిక అలజడి ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెడతాయి. ప్రతికూల ఆలోచనలతో మనసు గందరగోళంగా ఉంటుంది. ఓర్పు సహనంతో ఉండాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.

మీన రాశి

మీన రాశి జాతకులకు ఈ సమయంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతరుల వల్ల మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. వృత్తి జీవితంలో ఆఫీసు రాజకీయాల కారణంగా ఆటంకాలు అధికమవుతాయి. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

తదుపరి వ్యాసం