తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shivratri Special : ఇక్కడ త్రిశూలానికి బదులుగా పంచశూలం ఎందుకు?

Shivratri Special : ఇక్కడ త్రిశూలానికి బదులుగా పంచశూలం ఎందుకు?

HT Telugu Desk HT Telugu

14 February 2023, 15:49 IST

    • Baba Baidyanath Temple : ఎక్కడైనా మనం త్రిశూలం చూస్తుంటాం.. దాని గురించి వింటుంటాం. కానీ ఓ శివాలయంలో మాత్రం.. త్రిశూలానికి బదులుగా పంచశులాన్ని శిఖరంపై పెడతారు. ఇది ఎక్కడ ఉంది.., పంచశూలం ఎందుకు?
బాబా బైద్యనాథ్ పంచశూలం
బాబా బైద్యనాథ్ పంచశూలం

బాబా బైద్యనాథ్ పంచశూలం

దేవదేవుడికి అత్యంత ఇష్టమైన రోజు.. శివరాత్రి(Shivratri). భక్తులు ఎంతో నిష్టంగా.. ఈరోజును జరుపుకొంటారు. ఉపవాసం, జాగరణతో దేశవ్యాప్తంగా శివయ్య పేరు మారుమోగిపోనుంది. ప్రముఖ దేవాలయాల్లో భక్తులు కిటకిటలాడుతారు. జార్ఖండ్ బైద్యనాథ్ ఆలయం(Baidyanath temple).. ఇది శివుడి అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగ ఆలయాల్లో ఒకటి. బాబా బైద్యనాథ్ ధామ్, బైద్యనాథ్ ధామ్ అని కూడా అంటారు. ఈ ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్‌ఘర్ ప్రదేశంలో ఉంది.

లేటెస్ట్ ఫోటోలు

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

Mercury transit: వీరి మీద కనక వర్షం కురిపించబోతున్న బుధుడు.. అందులో మీరు ఉన్నారా?

May 16, 2024, 01:34 PM

Jupiter combust: అస్తంగత్వ దశలోకి గురు గ్రహం.. వీరికి అప్పులు, సమస్యలు, కష్టాలే

May 16, 2024, 01:11 PM

వృషభ రాశిలో సూర్యుడు: నెలపాటు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. ఈ ఇబ్బందులు కలగొచ్చు

May 16, 2024, 12:10 PM

Guru Aditya yoga: 12 ఏళ్ల తర్వాత గురు ఆదిత్య యోగం.. వీరికి గౌరవం, డబ్బు, అన్నింటా విజయం

May 16, 2024, 08:25 AM

సాధారణంగా శివాలయం(Shivalayam)లో గుడి శిఖరం మీద త్రిశూలం మీద పెడతారు. అయితే బైద్యనాథ్ ఆలయంలో మాత్రం.. పంచశూలం(Panchashul) దర్శనమిస్తుంది. ప్రతిరోజు ఈ ఆలయాన్ని వేలమంది దర్శించుకుంటారు. అయితే పంచశూలం మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.

దేశంలో ఎక్కడకు వెళ్లినా.. శివాలయాలు దర్శనమిస్తాయి. అత్యంత విశ్వాసంతో శివుడిని అభిషేకిస్తే.. చాలు కోర్కెలు తీర్చుతాడని.. భక్తుల నమ్మకం. శివాలయాలు ప్రత్యేకంగా ఉంటాయి. జార్ఖండ్‌లోని దేవ్ ఘర్‌ బైద్యనాథ్ ఆలయం కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. అయితే త్రిశూలానికి బదులుగా.. పంచశూలం ఇక్కడ ఉంటుంది.

శివాలయంలో త్రిశూలంలో మూడు కోణాలతో ఆయుధం ఉంటుంది. ఇది శివుడికి ఇష్టమైనదిగా చెబుతారు. మహాదేవుడి విగ్రహం ఉందంటే.. అక్కడ త్రిశూలం ఉంటుంది. పంచశూలంలో మాత్రం.. ఐదు కోణాల ముక్కులను తయారు చేస్తారు. ఐదు సంఖ్య శివయ్యకు ఇష్టమైనదని నమ్ముతారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పంచముఖి(Panchamukhi) మహాదేవ ఆలయాలు, కనిపించడానికి ఇది కూడా కారణమంటారు. పంచముఖి రుద్రాక్ష, శివ పంచాక్షరి మంత్రం మెుదలైన వాటి గురించి కూడా వినే ఉంటారు.

బాబా వైద్యనాథ ఆలయం(Baba Baidyanath temple) శిఖరంపై ఏర్పాటు చేసిన పంచశూలం మనిషిలోని ఐదు దుర్గుణాలు.., కామం, కోపం, లోభం, దురాశ, అసూయ నుండి కాపాడుతుందని భక్తులు నమ్ముతారు. పంచశూలం మనిషిని అన్ని బాధల నుంచి దూరం చేస్తుందట. వాస్తు, మతపరమైన దృక్కోణంలోనూ చాలా ప్రాముఖ్యత ఉంది. దీనికి సంబంధించి.. ఓ కథ కూడా ఉంది. రావణుడు.. తన నగరంలో పంచశూలాన్ని ప్రతిష్టించాడని నమ్ముతారు. ఎందుకంటే.. ఇది ఉన్న చోట రక్షణ కవచంలాగా ఉంటుందని చెబుతారు. పంచశూల రక్షణ కవచాన్ని ఎలా చేధించాలో రావణుడికి మాత్రమే తెలుసట.

తదుపరి వ్యాసం