తెలుగు న్యూస్  /  national  /  Delhi Cm Kejriwal : సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు - అరెస్ట్ చేసే ఛాన్స్..? ఆందోళనకు దిగిన 'ఆప్'

Delhi CM Kejriwal : సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు - అరెస్ట్ చేసే ఛాన్స్..? ఆందోళనకు దిగిన 'ఆప్'

21 March 2024, 21:01 IST

    • Delhi Excise Policy Case Updates: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే కవితను అరెస్ట్ చేసిన ఈడీ…. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) నివాసంలో సోదాలు చేపట్టింది. ఇంట్లోకి వెళ్లిన ఈడీ అధికారుల బృందం... కేజ్రీవాల్ తో పాటు ఆయన భార్య ఫోన్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ నివాసం వద్ద ఆప్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్ ను కలిసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ప్రస్తుతం కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే 9 సార్లు సమన్లు జారీ అయ్యాయి. కానీ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. తాజాగా ఆయన ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ ఈ కేసులో ఊరట దక్కలేదు. అరెస్ట్ నుంచి మినహాయించేందుకు కోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితిలో జోక్యం చేసుకోలేమని... అరెస్ట్ మినహాయింపు ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. కోర్టు ఆదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఇవాళ సాయంత్రం తర్వాత... కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది. 8 మంది అధికారులతో కూడిన బృందం... కేజ్రవాల్ నివాసంలో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి పలు అంశాలపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

తదుపరి వ్యాసం