తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Zomato Share Price: జొమాటో జూమ్.. 17.71 శాతం పెరిగిన షేర్ ధర

Zomato share price: జొమాటో జూమ్.. 17.71 శాతం పెరిగిన షేర్ ధర

HT Telugu Desk HT Telugu

02 August 2022, 10:34 IST

    • Zomato share price: మొన్నటి వరకు నేల చూపులు చూసిన జొమాటో షేర్ ధర.. ఈరోజు ఏకంగా 17 శాతానికి పైగా పెరిగింది.
క్యూ1 ఫలితాలు వెల్లడయ్యాక జొమాటో షేర్ ధర ఏకంగా 18 శాతం వరకు పెరిగింది. ఈ స్టాక్‌పై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు buy రేటింగ్ ఇచ్చాయి.
క్యూ1 ఫలితాలు వెల్లడయ్యాక జొమాటో షేర్ ధర ఏకంగా 18 శాతం వరకు పెరిగింది. ఈ స్టాక్‌పై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు buy రేటింగ్ ఇచ్చాయి. (REUTERS)

క్యూ1 ఫలితాలు వెల్లడయ్యాక జొమాటో షేర్ ధర ఏకంగా 18 శాతం వరకు పెరిగింది. ఈ స్టాక్‌పై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు buy రేటింగ్ ఇచ్చాయి.

Zomato share price: జొమాటో షేర్ ధర ఈ రోజు ఉదయం 10.27 గంటల సమయానికి 17.71 శాతం పెరిగి రూ. 54.50కి చేరుకుంది. గ్రోఫర్స్ (బ్లింకిట్) టేకోవర్ చేసిన సందర్భంలో స్టాక్ ఏకంగా రూ. 40కి పడిపోయింది. తిరిగి క్రమంగా పుంజుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

అయితే తాజాగా జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలు వెలువరించిన నేపథ్యంలో స్టాక్ బాగా లాభపడింది. గత ఏడాది క్యూ1తో పోల్చితే నష్టాలు భారీగా తగ్గడంతో మదుపరుల్లో ఈ స్టాక్‌పై ఆసక్తి పెరిగింది.

గత ఏడాది క్యూ1లో రూ. 352.1 కోట్లుగా ఉన్న నష్టాలు ఈ క్యూ1లో రూ. 185.7 కోట్లకు తగ్గాయి. మొన్నటి మార్చితో ముగిసిన క్యూ4లో కూడా నష్టాలు రూ. 359 కోట్లుగా ఉన్నాయి.

ఫుడ్ డెలివరీ యాప్ నష్టాలు తగ్గడంతో మంగళవారం జొమాట్ స్టాక్ ధర అమాంతం పెరిగింది. ఒక దశలో మంగళవారం ఈ స్టాక్ ధర 54.95కు పెరిగింది.

గోల్డ్‌మాన్ సాక్స్ ఈ స్టాక్‌పై బయ్ రేటింగ్ కలిగి ఉంది. షేర్ ధర టార్గెట్ రూ. 100గా పేర్కొంది.

మోర్గాన్ స్టాన్లీ ఈ స్టాక్ పై రూ. 80 టార్గెట్ ధరను కలిగి ఉంది. అలాగే యూబీఎస్ సంస్థ ఈ స్టాక్ పై బయ్ కాల్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ రూ. 95గా ఇచ్చింది.

తదుపరి వ్యాసం