తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Taliban : 'జంతువుగా కనిపించేందుకే హిజావ్​ వేసుకోవట్లేదు'

Taliban : 'జంతువుగా కనిపించేందుకే హిజావ్​ వేసుకోవట్లేదు'

Sharath Chitturi HT Telugu

17 June 2022, 10:58 IST

    • అఫ్గాన్​లో మహిళలు హిజాబ్​ ధరించకుండా జంతువుల్లాగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారని తాలిబన్ ప్రభుత్వం పోస్టర్లు ఏర్పాటు చేసింది. కాందహార్​ నగరంలోని రెస్టారెంట్లు, కేఫ్​ల బయట ఈ పోస్టరు వెలిశాయి.
'జంతువుగా కనిపించేందుకే హిజావ్​ వేసుకోవట్లేదు'
'జంతువుగా కనిపించేందుకే హిజావ్​ వేసుకోవట్లేదు' (AFP)

'జంతువుగా కనిపించేందుకే హిజావ్​ వేసుకోవట్లేదు'

తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్​ ప్రజలు కఠిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వార్తలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై తీవ్ర ఆంక్షలతో విరుచుకుపడుతోంది తాలిబన్​ ప్రభుత్వం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. రోడ్ల మీద పోస్టర్లు అతికించే స్థితికి చేరింది! 'హిజాబ్​ ధరించని ముస్లిం మహిళలు.. జంతువుల్లాగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు,' అంటూ విరుచుకుపడింది.

మారని తాలిబన్లు..

అమెరికా సైన్యం వెనుదిరగడంతో గతేడాది ఆగస్టులో అఫ్గాన్​ను తన వశం చేసుకుంది తాలిబన్​ బృందం. ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తోంది. అయితే బాలికలు, మహిళపై తీవ్రమైన నిబంధనలు విధిస్తోంది. ముఖ్యంగా వారి చదువులు, మతపరమైన ఆచారాల పట్ల మరింత కఠినంగా ఉంటోంది. ఈ క్రమంలోనే కాందహార్​ నగరంలో పోస్టర్లు వెలిశాయి. బుర్ఖాలు, హిజాబ్​లను.. పై నుంచి కింది వరకు ధరించిన మహిళల ఫొటోలు ఆ పోస్టర్లలో ఉన్నాయి. 'జంతువుల్లా కనిపించేందుకే హిజావ్​ వేసుకోవడం లేదు' అన్న అర్ధం వచ్చేట్టు పోస్టర్ల కింద రాసి ఉంది. ఈ పోస్టర్లు నగరంలోని రెస్టారెంట్లు, కేఫ్​ల బయట ఏర్పాటు చేశారు.

"ముఖాలను హిజాబ్​తో కప్పుకోని మహిళల కోసమే ఈ పోస్టర్లు. వారు హిజాబ్​ వేసుకునే విధంగా చూడాలని వారి కుటుంబానికి చెబుతాము," అని ఓ అధికారి అన్నారు. మహిళలు ఆదేశాలు పాటించకపోతే.. వారి కుటుంబసభ్యుల ప్రభుత్వ ఉద్యోగాలను తీసేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఫర్​ ప్రమోషన్​ ఆఫ్​​ వర్చ్యూ అండ్​ ప్రివెన్షన్​ ఆఫ్​ వైస్​ ఆదేశాల ప్రకారమే పోస్టర్లు అంటిస్తున్నట్టు తెలుస్తోంది.

మహిళలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అనధికారిక ఆదేశాలు ఇప్పటికే ఇచ్చారు తాలిబన్లు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు.. హిజాబ్​ ధరించాలని చెబుతున్నారు. షార్ట్​లు, టైట్​ జీన్స్​, ట్రాన్స్​పరెంట్​ బట్టలు వేసుకోకూడదని తేల్చిచెప్పారు.

తాలిబన్ల పాలనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళల భద్రత, హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం