తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Woman Expectations : 'కనీసం 25లక్షల ప్యాకేజ్​ కావాలి'- 8లక్షలు సంపాదిస్తున్న అబ్బాయి రిజెక్ట్​!

Woman expectations : 'కనీసం 25లక్షల ప్యాకేజ్​ కావాలి'- 8లక్షలు సంపాదిస్తున్న అబ్బాయి రిజెక్ట్​!

Sharath Chitturi HT Telugu

05 April 2024, 11:27 IST

  • Trending news latest : రూ. 25లక్షల ప్యాకేజ్​ ఉన్న వారినే పెళ్లి చేసుకుంటాని, రూ.8లక్షల ప్యాకేజ్​ ఉన్న వ్యక్తిని రిజెక్ట్​ చేసింది ఓ మహిళ. ఈ వార్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఎక్కువ జీతం ఉన్న వారినే పెళ్లి చేసుకుంటామని తేల్చిచెపుతున్న మహిళ
ఎక్కువ జీతం ఉన్న వారినే పెళ్లి చేసుకుంటామని తేల్చిచెపుతున్న మహిళ (Unsplash/@kography)

ఎక్కువ జీతం ఉన్న వారినే పెళ్లి చేసుకుంటామని తేల్చిచెపుతున్న మహిళ

Woman rejects engineer for salary : పెళ్లి విషయంలో ఈ మధ్యకాలంలో మహిళల ఆలోచనలు మారాయి. ఎక్కువ జీతం ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సంబంధిత వ్యక్తి విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటే.. ఎక్స్​ట్రా క్వాలిఫికేషన్​గా భావిస్తున్నారు. ఇలాంటి వార్త ఒకటి ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓ వ్యక్తి.. తన స్నేహితుడికి ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు. 8లక్షల ప్యాకేజ్​ ఉన్న కారణంతో.. తన స్నేహితుడిని ఓ మహిళ రిజెక్ట్​ చేసిందని చెప్పుకొచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

ఇదీ జరిగింది..

"గతేడాది.. నా స్నేహితుడికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. నా స్నేహితుడు ఒక ఇంజినీర్​. రూ. 8లక్షల ప్యాకేజ్​ వస్తుంది. అది సరిపోదని, కనీసం రూ. 25లక్షల ప్యాకేజ్​ ఉండాలని, ఆ మహిళ రిజెక్ట్​ చేసింది. పని చేయలేకపోతున్నానని ఆ మహిళ తన ఉద్యోగాన్ని వదిలేసింది. ఇప్పుడు ఏం పని చేయడం లేదు," అని ట్విట్టర్​లో చెప్పాడు ఓ నెటిజన్​.

"అబ్బాయి జీతం తక్కవని రిజెక్ట్​ చేశారు." అని ఆ నెటిజెన్​ పేర్కొన్నారు.

ఈ పోస్ట్​ వెంటనే వైరల్​గా మారింది. పోస్ట్​ చేసిన ఒక్క రోజులోనే 5.1లక్షల వ్యూస్​, 3900 లైక్స్​ వచ్చాయి. అయితే.. చాలా మంది ఆ మహిళకు మద్దతుగా కామెంట్స్​ చేస్తున్నారు.

'అందులో తప్పేం ఉంది..?'

Trending new latest : "మంచిదే! ఎక్స్​పెక్టేషన్స్​ (అంచనాలు) ఉంటే తప్పేముంది? పైగా.. పెళ్లికి ముందే ఆ మహిళ తనకు కావాల్సింది చెప్పింది. ఇది అబ్బాయికే మంచిది! 2-3ఏళ్లల్లో ఆ అబ్బాయి రూ. 25లక్షల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. మరో మహిళను పెళ్లి చేసుకుంటాడు," అని ఓ నెటిజెన్​ రాసుకొచ్చారు.

"మెట్రో నగరాల్లో బతకాలంటే రూ. 8లక్షల ప్యాకేజ్​ చాలా తక్కువ. కనీసం రూ. 15లక్షల ప్యాకేజ్​ ఉండాలి," అని మరో నెటిజన్​ పేర్కొన్నారు.

"చాలా కఠినమైన విషయం. కానీ నిన్ను, నిన్నులా యాక్సెప్ట్​ చేసేవారు నీకు దొరుకుతారు," అని మరో వ్యక్తి కామెంట్​ చేశారు.

Salary criteria for marriage : "అమ్మాయికి ఎక్స్​పెక్టేషన్స్​ ఉండటంలో తప్పు లేదు. కానీ.. రూ. 25లక్షల ప్యాకేజ్​ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని.. అతడికి ఉద్యోగం పోతే? ఆ మహిళ ఏం చేస్తుందో నాకు తెలుసుకోవాలని ఉంది. ఈ 8లక్షల ప్యాకేజ్​ ఉన్న వ్యక్తి.. రానున్న రోజుల్లో రూ. 25లక్షల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కూడా ఉంది కదా! పెళ్లి విషయంలో జీతం అనేది ఎలా ముఖ్యమవుతుంది," అని మరో వ్యక్తి రాసుకొచ్చారు.

"ప్రిఫరెన్స్​లను స్పష్టంగా చెబుతున్న వారిని తిట్టుకోకండి. పెళ్లి తర్వాత సమస్యలతో బాధపడటం కన్నా ఇది బెటర్​," అని మరో నెటిజన్​ పేర్కొన్నారు.

Salary criteria for marriage by women in India : మరి మీరేం అంటారు? అబ్బాయికి రూ. 8లక్షల ప్యాకేజ్​ సరిపోదా? అసలు పెళ్లి విషయంలో జీతం ఒక్కటి చూస్తే సరిపోతుందా? ఇలా రిజెక్ట్​ చేయడం కరెక్టేనా?

తదుపరి వ్యాసం