67.60 lakh package: 67.60 లక్లల ప్యాకేజ్; 100 శాతం ప్లేస్మెంట్; ఎక్కడో తెలుసా?
67.60 lakh package: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ ప్రముఖ విద్యా సంస్థల విద్యార్థులకు రికార్డు స్థాయిలో ప్లేస్ మెంట్స్ లభిస్తున్నాయి.

67.60 lakh package: చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (Indian Institute of Management IIM) విద్యార్థులకు ఈ సంవత్సరం 100% ప్లేస్ మెంట్ లభించింది.
67.60 lakh package: రూ. 67.70 లక్షలు..
రాయ్ పూర్ లో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (IIM) లో పీజీ పూర్తి చేసిన ఒక విద్యార్థికి గరిష్టంగా రూ. 67.70 లక్షల వార్షిక ప్యాకేజీ (LPA)తో జాబ్ లభించింది. ఆ విద్యా సంస్థలో ఈ సంవత్సరం సగటు వార్షిక సీటీసీ (CTC) రూ. 21.04 లక్షలు. గత సంవత్సరం కన్నా ఇది 19% ఎక్కువ. అత్యధిక వేతనం పొందిన టాప్ 10% విద్యార్థుల సగటు సీటీసీ (CTC) సంవత్సరానికి రూ. 34.64 లక్షలు (LPA). అలాగే, అత్యధిక వేతనం పొందిన టాప్ 25% విద్యార్థుల సగటు సీటీసీ (CTC) సంవత్సరానికి రూ. 28.25 లక్షలు. అత్యధిక వేతనం రూ. 67.70 లక్షలు (LPA) పొందిన విద్యార్థి సేల్స్ అండ్ మార్కెటింగ్ (Sales and Marketing) డొమైన్ కు చెందినవాడు కావడం విశేషం.
67.60 lakh package: బ్యాంకింగ్ ఇన్ స్టిట్యూట్స్ లోనే ఎక్కువ..
ఈ సంవత్సరం రాయ్ పూర్ లో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (IIM) లో పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు ఎక్కవగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో (BFSI) ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. మొత్తం విద్యార్థుల్లో 32% మంది ఈ రంగాల్లోనే జాబ్ సంపాదించారు. ఈ రంగాల్లో ఉద్యోగం సాధించిన విద్యార్థుల సగటు వార్షిక సీటీసీ (CTC) రూ 21.02 గా ఉంది. రెండో స్థానంలో IT/ITES సెక్టార్ ఉంది. ఇందులో 23% విద్యార్థులు రూ. 43.43 లక్షల సగటు వార్షిక సీటీసీతో ఉద్యోగం సాధించారు. మూడో స్థానంలో Strategy & Consulting విభాగం ఉంది. ఇందులో 14% విద్యార్థులు రూ. 19.64 లక్షల సగటు వార్షిక సీటీసీ (CTC) తో ఉద్యోగం సాధించారు.
టాపిక్