తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Coca-cola Diet Soda: కొకాకోలా డైట్ సొడాలో వాడే కృత్రిమ స్వీటెనర్ కేన్సర్ కారకమని ప్రకటించనున్న డబ్ల్యూహెచ్ఓ విభాగం

Coca-Cola diet soda: కొకాకోలా డైట్ సొడాలో వాడే కృత్రిమ స్వీటెనర్ కేన్సర్ కారకమని ప్రకటించనున్న డబ్ల్యూహెచ్ఓ విభాగం

HT Telugu Desk HT Telugu

29 June 2023, 18:14 IST

    • Coca-Cola diet soda: కొకాకోలా లో వాడే కృత్రిమ స్వీటెనర్ ఆస్పర్టేమ్ (aspartame) కేన్సర్ కారకమని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విభాగమైన ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (International Agency for Research on Cancer IARC) త్వరలో ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Coca-Cola diet soda: కొకాకోలా లో వాడే కృత్రిమ స్వీటెనర్ ఆస్పర్టేమ్ (aspartame) కేన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విభాగమైన ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (International Agency for Research on Cancer IARC) త్వరలో ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Iran President Raisi death : హెలికాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు రైసీ మృతి

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

కోక్ ఉత్పత్తుల్లో..

ఈ ఆస్పర్టేమ్ (aspartame) స్వీటెనర్ ను ప్రపంచ వ్యాప్తంగా చాలా ఉత్పత్తుల్లో విరివిగా వాడుతారు. కొకాకోలా డైట్ సోడా ఉత్పత్తుల్లో, మార్స్ ఎక్స్ట్రా చ్యూయింగ్ గమ్ సహా పలు చ్యూయింగ్ గమ్ ల్లో, పలు ఇతర బేవరేజెస్ ల్లో కృత్రిమ స్వీటెనర్ గా దీనిని వాడుతారు. ఈ స్వీటెనర్ వల్ల కేన్సర్ వచ్చే అవకాశముందన్న వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కేన్సర్ పరిశోధనల విభాగం ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (International Agency for Research on Cancer IARC) ఈ ఆస్పర్టేమ్ (aspartame) స్వీటెనర్ వల్ల కేన్సర్ వచ్చే అవకాశముందని నిర్ధారించింది. ఆ మేరకు ఈ ఆస్పర్టేమ్ (aspartame) ను IARC కేన్సర్ కారకంగా అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఈ అధికారిక ప్రకటన జులై నెలలో వెలువడనుందని తెలుస్తోంది. ఐఏఆర్సీ కి చెందిన శాస్త్రవేత్తలు ఈ నెలలో సమావేశమై ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. కేన్సర్ కారకంగా అధికారికంగా ప్రకటించడం వల్ల కొన్ని దేశాల్లో దీని వినియోగంపై నిషేధం, మరికొన్ని దేశాల్లో ఆంక్షలు విధించే అవకాశముంది.

ఎంతవరకు సేఫ్?

అయితే , ఈ ఆస్పర్టేమ్ (aspartame) ను ఎంత మోతాదులో తీసుకోవడం క్షేమకరమనే విషయాన్ని ఐఏఆర్సీ వెల్లడించలేదు. దీనిపై JECFA అనే మరో నిపుణుల కమిటీ ప్రకటన చేసే అవకాశముంది. కాగా, గతంలో ఐఏఆర్సీ చేసిన పలు సిఫారసులు, నిర్ధారణలు వివాదాస్పదమయ్యాయి. కొన్ని కోర్టు కేసుల వరకు వెళ్లాయి. ప్రజల్లో గందరగోళానికి, భయాందోళనలకు కారణమయ్యాయన్న విమర్శలను కూడా ఎదుర్కొన్నాయి. ఆస్పర్టేమ్ (aspartame) ను స్వల్ప మోతాదులో రోజువారీగా తీసుకోవడం ప్రమాదకరమేం కాదని 1981 నుంచి JECFA చెబుతూ వచ్చింది. ఉదాహరణకు వయోజనుడైన ఒక 60 కేజీల బరువున్న ఒక వ్యక్తి ప్రతీరోజు 12 నుంచి 36 క్యాన్ల డైట్ సోడా (అందులో వాడిన ఆస్పర్టేమ్ మోతాదును బట్టి)ను తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని JECFA వివరించింది. ఇన్నాళ్లూ ఇదే విషయాన్ని అమెరికా, యూరోప్ దేశాలు సహా పలు దేశాలు ఆరోగ్య నియంత్రణ సంస్థలు ఉదహరిస్తూ వచ్చాయి.

తదుపరి వ్యాసం