తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : భార్య తల నరికి.. మొండాన్ని ఊరేగించిన భర్త!

Crime news : భార్య తల నరికి.. మొండాన్ని ఊరేగించిన భర్త!

Sharath Chitturi HT Telugu

16 February 2024, 12:45 IST

    • Man Parades Wife's Severed Head : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి, తన భార్యను కిరాతకంగా చంపేశాడు. అనంతరం.. ఆమె మొండాన్ని రోడ్డు మీద ఊరేగించాడు! పశ్చిమ్​ బెంగాల్​లో జరిగింది ఈ ఘటన.
భార్య తల నరికి.. మొండాన్ని ఊరేగించిన భర్త!
భార్య తల నరికి.. మొండాన్ని ఊరేగించిన భర్త!

భార్య తల నరికి.. మొండాన్ని ఊరేగించిన భర్త!

Man kills wife in West Bengal : పశ్చిమ్​ బెంగాల్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి.. తన భార్య తల నరికి, మొండాన్ని ఊరేగించాడు! ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఇదీ జరిగింది..

పశ్చిమ్​ బెంగాల్​ పూర్బ్​ మేదినీపూర్​ జిల్లాలో ఫిబ్రవరి 14న జరిగింది ఈ ఘటన. ఆ రోజు.. వాలెంటైన్స్​ డే, సరస్వతి పూజ కలిసి వచ్చాయి. ఫలితంగా.. ఆ ప్రాంతంలోని మార్కెట్​లు ప్రజలతో కిక్కిరిసిపోయాయి.

Man parades wife's head in Bengal : ఇంతలో.. ఒంటి నిండా రక్తంతో ఉన్న 40ఏళ్లు గౌతమ్​ గుచైత్​ అనే వ్యక్తి.. ఓ మొండాన్ని పట్టుకుని రోడ్డు మీదకు వచ్చాడు. వెంటనే గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. బస్​స్టాప్​ వరకు వెళ్లి, రక్తపు చేతులతో మొండాన్ని పట్టుకుని అటు, ఇటు తిరగడం మొదలుపెట్టాడు. అది చూసిన స్థానికులు హడలెత్తిపోయారు. కొందరు.. ఆ దృశ్యాలను తమ ఫొన్​లలో చిత్రీకరించారు.

మహిళ మొండాన్ని పట్టుకుని ఓ వ్యక్తి రోడ్డు మీద బీభత్సం సృష్టిస్తున్నాడని.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ఘటనపై సమాచారం అందుకున్న గంటకు పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లినట్టు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్​ చేశారు.

West Bengal crime news : మరోవైపు.. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. 40ఏళ్ల గౌతమ్​ పట్టుకున్న మొండెం తన భార్య ఫూల్​రాణి గుచైత్​ది. వారి మధ్య గత కొన్నేళ్లు కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న అవి తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో.. భార్యని అతి కిరాతకంగా చంపేశాడు గౌతమ్​. అనంతరం.. మొండాన్ని పట్టుకుని ఊరేగించాడు.

మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా.. నిందితుడి తల్లిదండ్రులను కూడా అరెస్ట్​ చేశారు. అయితే.. తమ బిడ్డ మానసిక ఆరోగ్యం బాగోలేదని, నిందితుడి తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.

Man kills wife : రోడ్డు మీద భార్య మొండాన్ని పట్టుకుని ఊరేగించిన వ్యక్తికి సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

3ఏళ్ల క్రితం..!

మూడేళ్ల క్రితం.. కోల్​కతాలోని అలిపోర్​ జూలోని సింహ బోను ముందుకు ఓ వ్యక్తి దూకాడు. ఆ ఘటన అప్పట్లో తెగ వైరల్​ అయ్యింది. 14 అడుగుల గోడని దూకి, రెండు ఫెన్స్​లను దాటుకుని బోను దగ్గరికి వెళ్లాడు ఆ వ్యక్తి. అనంతరం సింహం ఉన్న డెన్​ వరకు వెళ్లాడు. ఆ వ్యక్తి.. ఇప్పుడు భార్య తల నరికి, మొండాన్ని ఊరేగించిన వ్యక్తి ఒకరే!

తదుపరి వ్యాసం