తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vistara Crisis : విస్తారాలో పైలట్​ సంక్షోభం- 60కి పైగా విమానాలు రద్దు.. నరకం చూస్తున్న ప్రయాణికులు!

Vistara Crisis : విస్తారాలో పైలట్​ సంక్షోభం- 60కి పైగా విమానాలు రద్దు.. నరకం చూస్తున్న ప్రయాణికులు!

Sharath Chitturi HT Telugu

02 April 2024, 11:16 IST

    • Vistara flights cancelled today : విస్తారాలో చాలా మంది పైలట్​లు ఒకేసారి సిక్​ లీవ్​ పెట్టారు. ఫలితంగా చివరి నిమిషంలో విమానాలు రద్దు అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. పైలట్​లు ఇలా చేయడానికి ఒక కారణం ఉంది!
విస్తారాలో పైలట్​ సంక్షోభం.. కారణం ఇదే!
విస్తారాలో పైలట్​ సంక్షోభం.. కారణం ఇదే! (HT_PRINT)

విస్తారాలో పైలట్​ సంక్షోభం.. కారణం ఇదే!

Vistara Crisis explained : సొమవారం నుంచి కొనసాగుతున్న విస్తారా ఎయిర్​లైన్స్​ పైలట్​ సంక్షోభం.. మంగళవారం మరింత తీవ్రమైంది. పైలట్​లు మూకుమ్మడిగా సిక్​ లీవ్​ పెట్టడంతో.. అనేక విమానాలు అనూహ్యంగా రద్దయ్యాయి. ఫలితంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. విస్తారా సంక్షోభాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

విస్తారా సంక్షోభానికి కారణం ఇదే..

టాటా గ్రూప్​నకు చెందిన ఈ విస్తారా ఎయిర్​లైన్స్​.. ఎయిర్​ ఇండియాలో విలీనం అవ్వనుంది. మరికొన్ని రోజుల్లో ఈ 'మెర్జర్​' అమల్లోకి వస్తుంది. ఈ తరుణంలో.. పైలట్​ల జీతాల విషయంలో కొత్త రూల్స్​ తీసుకొచ్చింది విస్తారా. తాజా సంక్షోభానికి కారణం ఇదే!

"కొత్త పే స్ట్రక్చర్​పై సంతకాలు చేయని పైలట్​లకు అప్​గ్రేడ్​ సీక్వెన్స్​ లిస్ట్​లో స్లాట్​ ఉండదు. పైలట్​లకు హామీనిచ్చిన 1 టైమ్​ బోనస్​ని కూడా ఇవ్వము. సంతకం చేయని పైలట్​లకు.. ఎయిర్​ ఇండియాతో పనిచేసేందుకు ఇష్టం లేదని మేము భావిస్తాము. ఎయిర్​ ఇండియా విలీన ప్రక్రియలో వారిని కలుపుకోము," అని పైలట్​లకు ఈ-మెయిల్​ పంపించింది విస్తారా ఎయిర్​లైన్స్​.

Vistara flights delayed : ఈ మెయిల్​ అందిన తర్వాత.. చాలా మంది పైలట్​లు గత రెండు రోజులుగా మూకుమ్మడి సిక్​ లీవ్​లు పెట్టేశారు. ఎక్స్​టెండెడ్​ డ్యూటీ విషయంలోనూ వారు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా.. విమాన సేవలకు తీవ్ర ఆటంకం ఎదురైంది.

విస్తారా పైలట్​ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్టు సోమవారం ఓ ప్రకటన చేసింది సంస్థ. కానీ.. ఇప్పటివరకు పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.

"పరిస్థితులను అదుపుచేసేందుకు మా బృందాలు పనిచేస్తున్నాయి. విమానాల రద్దు కారణంగా ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నాము," అని విస్తారా ఓ ప్రకటనలో తెలిపింది.

Vistara pilot crisis : సోమవారం ఒక్కరోజే.. 50 విమానాలు రద్దు అయ్యాయి. 160కిపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఇక మంగళవారం ఉదయం పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈరోజు మొత్తం మీద మరో 60 విమానాలు రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

నరకం చూస్తున్న ప్రయాణికులు..

విస్తారా యాజమాన్యం- పైలట్​ల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనతో ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. తన తాతకు ఆరోగ్యం విషమించిందని, చూడటానికి రాంచీ నుంచి దిల్లీ వెళ్లాలని ఫ్లైట్​ బుక్​ చేసుకుంటే.. విస్తారా ఫ్లైట్​ క్యాన్సిల్​ అయ్యిందని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరైనా తనకు సాయం చేయండని ట్వీట్​ చేశాడు.

ఈ విషయంపై స్పందించిన విస్తారా.. వివరాలను చెప్పాలని ఆ ప్రయాణికుడిని కోరింది. అతను వివరాలు చెప్పినా, ఫలితం దక్కలేదు! విస్తారా ఎయిర్​లైన్స్​ నుంచి స్పందన రాలేదని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.

Vistara crisis explained in Telugu : అదే సమయంలో.. విస్తారా కస్టమర్​ కేర్​ సర్వీస్​ కూడా పనిచేయడం లేదని చాలా మది ప్రయాణికులు మండిపడుతున్నారు. చివరి నిమిషంలో ఇలా తమను వదలేయడం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు.

విస్తారా సంక్షోభంపై కేంద్రం దృష్టి..

విస్తారా పైలట్​ సంక్షోభంపై కేంద్రం ఫోకస్​ చేసింది. ఈ పూర్తి వ్యవహారంపై నివేదిక అందించాలని.. విస్తారాకు ఆదేశాలిచ్చారు. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. ఇలాంటి సంక్షోభం సమయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా స్పష్టంగా చెప్పాలని తెలిపారు.

విస్తారా సంక్షోభానికి ఎప్పుడు ముగింపు పడుతుందో తెలియదు. అందుకే ప్రయాణికులు.. విమానాశ్రయానికి వెళ్లే ముందు, ఫ్లైట్​ స్టేటస్​ చెక్​ చేసుకోవడం ఉత్తమం.

తదుపరి వ్యాసం