Flight receives bomb threat: విమానానికి బాంబు బెదిరింపు; ప్రయాణికులను దింపేసిన ఎయిర్ లైన్స్-delhi to pune vistara flight receives bomb threat call probe on ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Delhi To Pune Vistara Flight Receives Bomb Threat Call, Probe On

Flight receives bomb threat: విమానానికి బాంబు బెదిరింపు; ప్రయాణికులను దింపేసిన ఎయిర్ లైన్స్

HT Telugu Desk HT Telugu
Aug 18, 2023 02:02 PM IST

Flight receives bomb threat: ఢిల్లీ విమానాశ్రయంలో విమానం మరి కాసేపట్లో బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో ఏర్ పోర్ట్ లోని జీఎంఆర్ కాల్ సెంటర్ కు ఫోన్ కాల్. ఆ విమానంలో బాంబు ఉందని, అది కాసేపట్లో పేలనుందని ఆ ఫోన్ చేసిన ఆగంతకుడు చెప్పాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Bomb threat call to Flight: శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయం.. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం మరి కాసేపట్లో బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో ఏర్ పోర్ట్ అధికారులకు ఫోన్ కాల్. గేట్ నెంబర్ 42 వద్ద పార్క్ చేసి ఉన్న ఆ విమానంలో 3 బాంబులు పెట్టామని, అవి ఒక గంట సేపట్లో పేలనున్నాయని ఆ ఫోన్ చేసిన ఆగంతకుడు చెప్పాడు. ఆ వెంటనే కాల్ డిస్ కనెక్ట్ చేశాడు. వెంటనే కాల్ సెంటర్ స్టాఫ్ విమానాశ్రయ అధికారులకు, ఏర్ పోర్ట్ పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో, వెంటనే ఆ విమాన ప్రయాణాన్ని నిలిపివేసి, ప్రయాణికులను అందరినీ సురక్షితంగా కిందకు దింపి, పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఆ విమానంలో తనిఖీలు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ టు పుణె

ఢిల్లీ నుంచి పుణె వెళ్లాల్సిన విస్తారా ఎయిర్ లైన్స్ యూకే 971 విమానానికి సంబంధించి శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఈ బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దాంతో టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న ఆ విమానాన్ని వెంటనే నిలిపివేశారు. ప్రయాణికులను, వారి లగేజ్ తో సహా దింపివేశారు. అనంతరం, విమానంలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులకు ఏర్ పోర్ట్ లో డ్రింక్స్, స్నాక్స్ అందించామని, ప్రయాణికులంతా సేఫ్ గా ఉన్నారని విస్తారా ఎయిర్ లైన్స్ తెలిపింది. పోలీసుల తనిఖీలు పూర్తయిన తరువాత, విమానం యథావిధిగా పుణె బయల్దేరుతుందని తెలిపారు. ఆ తరువాత ఏర్ పోర్ట్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. విమానాన్ని పూర్తిగా పరిశీలించామని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని తెలిపారు. ఈ తప్పుడు బెదిరింపు కాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

WhatsApp channel