తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Student Visa New Rules: యూఎస్ స్టుడెంట్ వీసా అప్లికేషన్లకు కొత్త నిబంధనలు; నవంబర్ 27 నుంచి అమల్లోకి..

US Student Visa new rules: యూఎస్ స్టుడెంట్ వీసా అప్లికేషన్లకు కొత్త నిబంధనలు; నవంబర్ 27 నుంచి అమల్లోకి..

HT Telugu Desk HT Telugu

25 November 2023, 20:26 IST

    • US Student Visa new rules: అమెరికాలో ఉన్నత విద్య కోసం F, M, J స్టుడెంట్ వీసాలకు అప్లై చేసే విద్యార్థులకు అలర్ట్. ఆయా వీసా దరఖాస్తు ప్రక్రియ విషయంలో కొత్త నిబంధనలు వచ్చాయి. అవి నవంబర్ 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

US Student Visa new rules: యుఎస్ స్టుడెంట్ వీసా దరఖాస్తు ప్రక్రియలో మార్పులను అమెరికా ఎంబసీ ప్రకటించింది. ఈ మార్పులు నవంబర్ 27, 2023 నుంచి అమలులోకి వస్తాయి. ఈ మార్పులు భారతీయ నగరాల్లోని అన్ని రాయబార కార్యాలయాలకు వర్తిస్తాయి. యుఎస్‌లో చదువుకోవడానికి దరఖాస్తు చేస్తున్న విద్యార్థులు, F, M, J స్టూడెంట్ వీసా ప్రోగ్రామ్ కింద దరఖాస్తు చేయబోతున్న విద్యార్థులు ఈ మార్పులను గమనించాలి. ఈ మార్పులను యూఎస్ ఎంబసీ తన ట్విటర్ ఖాతాలో ప్రకటించింది.

సొంత పాస్ పోర్ట్ వివరాలు..

మారిన నిబంధనల ప్రకారం.. F, M, J స్టూడెంట్ వీసా కోసం అప్లై చేస్తున్న విద్యార్థులు వీసా కోసం ప్రొఫైల్ క్రియేట్ చేసే సమయంలో, వీసా అపాయింట్ మెంట్ కోసం షెడ్యూలింగ్ చేస్తున్న సమయంలో తమ సొంత, ప్రస్తుతం తమ వద్ద ఉన్న, సరైన పాస్ పోర్ట్ వివరాలను మాత్రమే ఉపయోగించాలి. వీసా అపాయింట్ మెంట్ సిస్టమ్ ను దుర్వినియోగం చేయకుండా, స్టుడెంట్ వీసా స్లాట్స్ లో మోసాలను అరికట్టడానికి ఈ మార్పులు చేస్తున్నట్లు యూఎస్ ఎంబసీ ప్రకటించింది.

కరెక్ట్ పాస్ పోర్ట్ నంబర్

వీసా కోసం ప్రొఫైల్ క్రియేట్ చేసే సమయంలో, వీసా అపాయింట్ మెంట్ కోసం షెడ్యూలింగ్ చేస్తున్న సమయంలో సరైన పాస్ పోర్ట్ నంబర్ నమోదు చేయని పక్షంలో ఆ అప్లికేషన్ ఫామ్ ను వీసా అప్లికేషన్ సెంటర్ (Visa Application Centers VAC) లలో పరిగణనలోకి తీసుకోబోరని ఎంబసీ స్పష్టం చేసింది. సంబంధిత అపాయింట్ మెంట్ లను కేన్సిల్ చేస్తామని తెలిపింది. వారి చెల్లించిన వీసా ఫీజు కూడా వెనక్కు రాదని హెచ్చరించింది.

F లేదా M వీసా కోసం..

టైప్ F లేదా M వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) ద్వారా ధృవీకరించబడిన పాఠశాల లేదా ప్రోగ్రామ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. J రకం వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఆమోదించిన సంస్థ నుండి స్పాన్సర్‌షిప్ పొందాల్సి ఉంటుంది.

ఇప్పటికే ప్రొఫైల్ ఉన్నవారు..

ఇప్పటికే తప్పు సమాచారంతో ప్రొఫైల్‌ను సృష్టించిన లేదా తప్పు పాస్‌పోర్ట్ నంబర్‌ని ఉపయోగించి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్న వారు సరైన పాస్‌పోర్ట్ సమాచారాన్ని కలిగి ఉన్న కొత్త ప్రొఫైల్‌ను సృష్టించాలని లేదా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి సరైన పాస్‌పోర్ట్ సమాచారాన్ని కలిగి ఉన్న ఏదైనా ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయాలని యూఎస్ ఎంబసీ తెలిపింది. అయితే, ఇది తప్పు పాస్‌పోర్ట్ సమాచారాన్ని కలిగి ఉన్న ప్రొఫైల్‌తో అసోసియేట్ అయి ఉంటే వీసా ఫీజు మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ ను పోగొట్టుకున్నవారు వీసా అపాయింట్‌మెంట్ కోసం పోగొట్టుకున్న ఆ పాత పాస్‌పోర్ట్ ఫోటోకాపీని చూపించాల్సి ఉంటుందని ఎంబసీ తెలిపింది.

తదుపరి వ్యాసం