Looking for UK visa?: ఈ ఐదు రంగాల్లో మీరు నిపుణులా?.. మీకు యూకేలో హై డిమాండ్; వీసా చాలా ఈజీగా వచ్చేస్తుంది..
Looking for UK visa?: విదేశాలకు వెళ్లాలని చూస్తున్న భారతీయుల్లో చాలామంది చాయిస్ యూకే. ఇంగ్లండ్, వేల్స్‌లో భారతీయ సంతతి కుటుంబాలు చాలా ఉన్నాయి. 2022లో భారతీయులకు గణనీయమైన సంఖ్యలో యూకే వీసాలు జారీ చేశారు.
Looking for UK visa?: అమెరికా, కెనడా ల తరువాత భారతీయులు సెటిల్ కావాలని కోరుకునే మరో దేశం బ్రిటన్. ఇప్పటికే అక్కడ మన భారతీయులు ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ప్రభావశీలంగా ఉన్నారు. అయితే, యూకే వీసా (UK visa) లభించడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఐటీ లో ఈ వీసాకు చాలా డిమాండ్ ఉంది.
ట్రెండింగ్ వార్తలు
ఈ ప్రొఫెషన్స్ కు మంచి డిమాండ్
యూకేలో ఉద్యోగ, ఉపాధి వర్గాల కొరత చాలా ఉంది. అయినప్పటికీ, యూకే వీసా (UK visa) సంపాదించడం అంత సులభం కాదు. భారతీయుల్లో అన్ని వర్గాల వారు యూకే వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఏ వృత్తుల్లో బ్రిటన్ లో ఎక్కువ డిమాండ్ ఉందో చెక్ చేసుకుని, తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటే, యూకే వీసా సులభంగా పొందవచ్చు. ప్రస్తుతం కింద పేర్కొన్న ఐదు రంగాల్లోని నిపుణులకు వారికి యూకేలో చాలా డిమాండ్ ఉంది.
Healthcare Professionals: వైద్య రంగం
కోవిడ్ తరువాత యూకేలో వైద్య నిపుణులకు డిమాండ్ చాలా పెరిగింది. వైద్యులు, ఇతర వైద్య సహాయ సిబ్బంది అవసరం యూకే లో చాలా ఉంది. అందుకే, యూకే స్కిల్డ్ వర్కర్ వీసా స్కీమ్ (UK's Skilled Worker visa scheme) లో వారిని భాగం చేశారు. ఈ స్కీమ్ ద్వారా డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్ట్ లు, హోం కేర్ ప్రొఫెషన్లు.. తదితరులు యూకే వీసాను ఈజీగా పొందవచ్చు. ఈ వీసా ద్వారా వారు UKలో 5 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఆ తరువాత కూడా దానిని నిరవధికంగా పునరుద్ధరించుకోవచ్చు. అయితే, ఈ వీసా కోసం అర్హత సాధించాలంటే, మీరు తప్పనిసరిగా యూకేలోని ఎంప్లాయర్ నుంచి నిబంధనలకు అనుగుణమైన వేతనంతో జాబ్ ఆఫర్ ను పొంది ఉండాలి.
Traditional Engineering: సంప్రదాయ ఇంజనీరింగ్
ప్రస్తుతం యూకేలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇంజనీర్లకు హై డిమాండ్ ఉంది. ఈ విభాగాల్లో విద్యార్హతలతో పాటు, అనుభవం ఉన్నవారికి యూకే స్వాగతం పలుకుతోంది. యూకే ఇంజనీరింగ్ ఇండస్ట్రీ 2022 నుంచి 2027 వరకు ఏటా 2.7% చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా. అందువల్ల, ఈ విభాగాల్లో సరైన డిగ్రీ, ఎక్స్ పీరియెన్స్ ఉన్నవారు సులభంగా యూకే వీసా పొందవచ్చు.
IT sector: ఐటీ రంగం
అలాగే, యూకేలో ఐటీ సెక్టార్‌లో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఒక నివేదిక ప్రకారం, బిజినెస్ అనలిస్ట్స్, ఆర్కిటెక్ట్స్, సిస్టమ్స్ డిజైనర్లతో సహా IT రంగం 2027 నాటికి 4.2% ఉద్యోగ వృద్ధిని చూసే అవకాశం ఉంది. తద్వారా 5,200 కొత్త పొజిషన్లు కూడా ఏర్పాటవుతాయి. అదనంగా, 2027 నాటికి యూకేలో 39.6% ఉద్యోగులు రిటైర్ అవుతారు. ఫలితంగా కొత్తగా 49,600 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Programming and Software: ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్
ఈ రంగం 2027 నాటికి 4.2% ఉద్యోగ వృద్ధికి అవకాశం ఉంది. దీనివల్ల కొత్తగా 12,500 ఉద్యోగాలు వస్తాయి. అదే సమయంలో, రిటైర్ అయ్యే ఉద్యోగుల కారణంగా కొత్తగా 1,18,900 ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ నివేదిక వెల్లడించింది.
Economics and Statistic: ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్
ఈ రంగంలో కూడా యూకేలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎకనమిస్ట్, స్టాటిస్టీషియన్ లు ప్రతీ వ్యాపారంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. విమర్శనాత్మక ఆలోచన, ప్రాబ్లం సాల్వింగ్ అవసరమైన రంగాలతో పాటు బీమా, ఫైనాన్స్, ప్రభుత్వ రంగాల్లో వీరి అవసరం చాలా ఉంటుంది. నేషనల్ కెరీర్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, ఈ రంగంలో 2027 నాటికి 4.3% ఉద్యోగ వృద్ధికి అవకాశం ఉంది. అలాగే, ఈ రంగంలోని 55.3 % మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. దాంతో, అదనంగా 23,200 కొత్త ఉద్యోగాలు వస్తాయి.