తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  H-1b Visa | H-1b వీసాల‌పై అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌

H-1B visa | H-1B వీసాల‌పై అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌

24 August 2022, 16:00 IST

  • H-1B visa | భార‌తీయ యువ‌త‌కు అమెరికాలో ఉద్యోగం సాధించ‌డం ఒక స్వ‌ప్నం. ఆ స్వ‌ప్న సాకారానికి అవ‌కాశం క‌ల్పించే H-1B వీసాపై అమెరికా బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. H-1B నాన్ ఇమిగ్రంట్ వీసా. అమెరికాలోని కంపెనీలు నిపుణులైన విదేశీయుల‌కు త‌మ సంస్థ‌ల్లో ఉద్యోగం క‌ల్పించేందుకు వీలుగా ఈ వీసాను జారీ చేస్తారు.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

H-1B visa | అమెరికా ఏటా విదేశీ ఉద్యోగార్థుల కోసం గ‌రిష్టంగా 65000 H-1B వీసాల‌ను జారీ చేస్తుంది. 2023 ఆర్థిక సంవ‌త్స‌రంలో కూడా 65 వేల H-1B వీసాల‌ను అమెరికా జారీ చేయ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

H-1B visa | USCIS ప్ర‌క‌ట‌న‌

ఈ ఆర్థిక సంవ‌త్స‌రం అమెరికా ప్ర‌భుత్వం జారీ చేయ‌నున్న 65 వేల‌ H-1B వీసాల‌కు అవ‌స‌ర‌మైన‌న్ని ద‌ర‌ఖాస్తులు ఇప్ప‌టికే వ‌చ్చాయ‌ని అమెరికా పౌర‌స‌త్వ, వ‌ల‌స సేవ‌ల విభాగం (US Citizenship and Immigration Services -USCIS) వెల్ల‌డించింది. వివిధ రంగాల్లో నిపుణులైన విదేశీయులు అమెరికాలోని సంస్థ‌ల్లో ఉద్యోగం చేయ‌డానికి ఈ వీసా పొంద‌డం అవ‌స‌రం. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఈ వీసాపైన‌నే ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతుంటాయి.

H-1B visa | ఇండియా, చైనా..

అమెరికాలోని టెక్నాల‌జీ సంస్థ‌లు ప్ర‌తీ సంవ‌త్స‌రం H-1B వీసా ద్వారా భార‌త్‌, చైనాల నుంచి వేల సంఖ్య‌లో ఉద్యోగుల‌ను నియ‌మించుకుంటాయి. H-1B వీసా పొందేవారిలో ఈ రెండు దేశాల వారే ఎక్కువ‌గా ఉంటారు. భార‌తీయులు స‌హా విదేశీ నిపుణుల‌కు ఈ వ‌ర్క్ వీసా పొంద‌డం ఒక క‌ల‌గా ఉంటుంది. అమెరికా పార్ల‌మెంటు నిర్ణ‌యం మేర‌కు ఏటా గ‌రిష్టంగా 65 వేల H-1B వీసాల‌ను జారీ చేస్తుంటారు. మ‌రో 20 వేల H-1B వీసాల‌ను అమెరికాలో విద్యాభ్యాసం చేసిన విదేశీయుల‌కు జారీ చేస్తారు. 2023 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈ రెండు కేట‌గిరీల్లోనూ అవ‌స‌ర‌మైన‌న్ని ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని USCIS ప్ర‌కటించింది.

తదుపరి వ్యాసం