తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Uk Visa Alert: యూకే వెళ్లే ప్లాన్ లో ఉన్నారా? వీసా ఫీజులు పెరిగాయి చూడండి..

UK Visa Alert: యూకే వెళ్లే ప్లాన్ లో ఉన్నారా? వీసా ఫీజులు పెరిగాయి చూడండి..

HT Telugu Desk HT Telugu

16 September 2023, 18:07 IST

  • UK Visa Alert: యునైటెడ్ కింగ్ డమ్ కు పై చదువుల కోసం కానీ,  టూరిస్ట్ గా కానీ వెళ్లాలనుకుంటున్నారా?.. బడ్జెట్ సరిచూసుకోండి. తాజాగా, ఈ రెండు కేటగిరీల వీసా ఫీజులు పెరిగాయి. పెరిగిన ఫీజులు అక్టోబర్ 4 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అందుకే, ఈ లోపే వీసాకు దరఖాస్తు చేసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UK Visa Alert: స్టుడెంట్, యూకే విజిటర్ వీసా ఫీజులు పెరిగాయి. ఆరు నెలల లోపు విజిట్ వీసా ఫీజు 115 పౌండ్లు, స్టుడెంట్ వీసా ఫాజు 490 పౌండ్లు పెంచినట్లు బ్రిటన్ హోం శాఖ వెల్లడించింది. అంటే, భారతీయ కరెన్సీలో విజిటర్ వీసా దరఖాస్తు ఫీజు రూ. 1,543, స్టుడెంట్ వీసా దరఖాస్తు ఫీజు రూ. 13,070 అదనంగా పెరిగింది. ఈ పెంచిన వీసా దరఖాస్తు ఫీజులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

అక్టోబర్ 4 నుంచి..

అక్టోబర్ 4వ తేదీ నుంచి యూకే విజిటర్ వీసా దరఖాస్తు ఫీజు సుమారు రూ. 11,835 గా , యూకే స్టుడెంట్ వీసా దరఖాస్తు ఫీజు సుమారు రూ. 50,428 గా ఉండనుంది. అలాగే, వర్క్ వీసా, విజిట్ వీసా ఫీజుల్లో కనీసం 15% పెంపు, ప్రయారిటీ వీసా ఫీజులో కనీసం 20% పెంపు ఉండబోతోందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. గతంలోనే ఈ పెంపు గురించి బ్రిటన్ ప్రధాని రుషి సునక్ సంకేతాలిచ్చారు. బ్రిటన్ ప్రభుత్వ నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) కు వీసా ఫీజుల ద్వారా లభించే నిధుల వాటాను గణనీయంగా పెంచనున్నట్లు గతంలో రుషి సునక్ వెల్లడించారు.

ఇతర వీసాల ఫీజులు

వైద్య చికిత్స కోసం బ్రిటన్ కు వచ్చే వారికి ఇచ్చే వీసాకు సంబంధించిన దరఖాస్తు ఫీజును, ఆరు నెలల పైబడి విజిటింగ్ వీసాలకు సంబంధించిన ఫీజులను, స్పాన్సర్ షిప్ వీసాలకు సంబంధించిన ఫీజులను కూడా పెంచారు.

తదుపరి వ్యాసం