తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ugc Net 2023 Results : రేపే యూజీసీ నెట్​ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

UGC NET 2023 results : రేపే యూజీసీ నెట్​ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

16 January 2024, 17:30 IST

  • UGC NET 2023 results : యూజీసీ నెట్​ 2023 ఫలితాలను బుధవారం విడుదల చేయనుంది ఎన్​టీఏ. ఎలా చెక్​ చేసుకోవాలి? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రేపే యూజీసీ ఎన్​ఈటీ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..
రేపే యూజీసీ ఎన్​ఈటీ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి.. (Getty Images/iStockphoto)

రేపే యూజీసీ ఎన్​ఈటీ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

UGC NET 2023 results : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ).. యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఫలితాలను రేపు (జనవరి 17) విడుదల చేయనుంది. యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఫలితాలను అభ్యర్థులు nta.ac.in, ugcnet.nta.ac.in అధికారిక వెబ్​సైట్స్​లో చెక్​ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

2023 డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 19 వరకు దేశవ్యాప్తంగా 292 నగరాల్లో ఈ యూజీసీ నెట్​ పరీక్షలను నిర్వహించింది ఎన్​టీఏ. మొత్తం 83 సబ్జెక్టుల్లో 9,45,918 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు.

UGC NET december 2023 results : వాస్తవానికి.. ఈ యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఫలితాలు జనవరి 10న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు విడుదలవ్వలేదు. ఈ నేపథ్యంలో.. బుధవారం ఫలితాలు వెలువడనున్నాయి. యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ప్రొవిజనల్ ఆన్సర్ కీని జనవరి 3న విడుదల చేసింది ఎన్​టీఏ. జనవరి 5 వరకు అభ్యంతరాల విండో అమల్లో ఉంది.

యూజీసీ నెట్ డిసెంబర్ ఫలితాలు 2023: ఎలా చెక్ చేసుకోవాలి

స్టెప్​ 1:- ugcnet.nta.ac.in అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- యూజీసీ నెట్ డిసెంబర్ ఫలితాల లింక్​పై క్లిక్ చేయాలి.

స్టెప్​ 3:- మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

స్టెప్​ 4:- స్క్రీన్​పై ఫలితాలు కనిపిస్తాయి. మీ ఫలితాలను చెక్​ చేసుకోండి.

స్టెప్​ 5:- భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ఫలితాల హార్డ్ కాపీని భద్రపరుచుకోండి.

UGC NET results 2023 : కాగా.. పరీక్ష, ఫలితాలకు సంబంధించిన తాజా అప్​డేట్స్ కోసం అభ్యర్థులు.. https://ugcnet.nta.ac.in/ అధికారిక ఎన్​టీఏ వెబ్​సైట్​ని సందర్శించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సహాయం కోసం ఎన్​టీఏ హెల్ప్​లైన్​ నెంబర్లను (011- 40759000/69227700) కూడా సంప్రదించవచ్చు.

తదుపరి వ్యాసం