తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Encounter: ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ తో ఎన్ కౌంటర్; ముగ్గురు సీఆర్ పీఎఫ్ కమాండోల మృతి

Encounter: ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ తో ఎన్ కౌంటర్; ముగ్గురు సీఆర్ పీఎఫ్ కమాండోల మృతి

HT Telugu Desk HT Telugu

30 January 2024, 18:49 IST

  • Encounter in Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ తో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా,మరో 14 మంది గాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ చత్తీస్ గఢ్ లోని సుక్మా-బీజాపూర్ సరిహద్దులో మంగళవారం చోటు చేసుకుంది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ తో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని టేకలగూడెం గ్రామ సమీపంలో భద్రతాసిబ్బంది గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.

2021లో ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే..

కోబ్రా 201 బెటాలియన్, సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్ కు చెందిన బృందం ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (FOB) ఏర్పాటు కోసం ఆ ప్రాంతంలో పని చేస్తుండగా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. 2021లో 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతంలోనే ఈ ఎన్ కౌంటర్ కూడా జరిగిందని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. అంతకు ముందు భద్రతా దళాలు రెండు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ లను స్వాధీనం చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో ఒకటి 5 కిలోలు, మరొకటి 3 కిలోల బరువున్న ఈ బాంబులను అమర్చినట్లు పోలీసులు తెలిపారు.పెట్రోలింగ్ సమయంలో ఈ ప్రాంతం గుండా వెళ్లే భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు పదార్థాలను అమర్చారు. అనంతరం ఆ బాంబులను బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS) నిర్వీర్యం చేసింది.

తదుపరి వ్యాసం