తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Transport Strike: కొత్త రవాణా చట్టాలపై వెనక్కి తగ్గిన కేంద్రం..డ్రైవర్ల ఆందోళన విరమణ

Transport Strike: కొత్త రవాణా చట్టాలపై వెనక్కి తగ్గిన కేంద్రం..డ్రైవర్ల ఆందోళన విరమణ

Sarath chandra.B HT Telugu

03 January 2024, 7:29 IST

    • Transport Strike: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం కేంద్రం కొత్తగా ప్రతిపాదించిన రవాణా చట్టాలపై వెనక్కి తగ్గింది. దేశ వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్‌ సంఘాల ఆందోళనతో రవాణాకు తీవ్ర అంతరాయం కలగడంతో కేంద్రం దిగొచ్చింది. 
హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాకు వినతి పత్రం ఇస్తున్న ట్రాన్స్‌పోర్ట్‌ సంఘాలు
హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాకు వినతి పత్రం ఇస్తున్న ట్రాన్స్‌పోర్ట్‌ సంఘాలు (Shrikant Singh)

హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాకు వినతి పత్రం ఇస్తున్న ట్రాన్స్‌పోర్ట్‌ సంఘాలు

Transport Strike: కేంద్రం ప్రతిపాదించిన కొత్త రవాణా చట్టాలపై ట్రాన్స్‌పోర్ట్‌ సంఘాలు చేపట్టిన ఆందోళనతో దేశ వ్యాప్తంగా రవాణా రంగం స్తంభించిపోయింది. హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్లపై కఠిన శిక్షలను ప్రతిపాదిస్తూ రూపొందించిన చట్టాలను నిరసిస్తూ లారీలు, ట్రక్కుల డ్రైవర్లు చేపట్టిన సమ్మె మంగళవారం దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళనకు కారణమైంది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఆయిల్‌ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో దేశం మొత్తం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌ కొరత ఏర్రపడింది. ట్రాన్స్‌పోర్ట్‌ సమ్మె రోజుల పాటు కొనసాగుతుందన్న వార్తలతో పెట్రోల్ బంకుల ముందు వాహనాలు బారులు తీరాయి.

పెట్రోల్‌ బంకుల ముందు భారీ క్యూ లైన్లు దర్శనం ఇచ్చాయి. అత్యధిక బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. వంట గ్యాస్‌ సిలిండర్లతో పాటు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు వంటి వస్తువుల రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది.

ట్రాన్స్‌పోర్ట్‌ సంఘాల సమ్మెపై కేంద్రం చర్చలు జరిపింది. ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంటీసీ) జరిపిన చర్చలు ఎట్టకేలకు మంగళవారం రాత్రి కొలిక్కి వచ్చాయి. కొత్త చట్టాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని కేంద్రం తరఫున హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ట్రాన్స్‌పోర్ట్‌ సంఘాలకు హామీ ఇచ్చారు.

ఏఐఎంటీసీతో లోతుగా చర్చించిన తర్వాత నిర్ణయం అమలు చేసేలా అంగీకారం కుదిరిన్నట్టు సంఘం చైర్మన్‌ మల్కిత్‌సింగ్‌ బల్‌ తెలిపారు. దాంతో సమ్మె విరమిస్తున్నట్టు సంఘం ప్రకటించారు.

రోడ్డు ప్రమాదంలో మరణానికి బాధ్యుడైన డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పారిపోయేతే పదేళ్ల దాకా కఠిన కారాగార శిక్ష, రూ.7 లక్షల దాకా జరిమానా విధించేలా భారత న్యాయ సంహితలో కొత్తగా చేర్చిన సెక్షన్లపై లారీలు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనల రద్దు డిమాండ్‌తో సోమవారం నుంచి ట్రక్కు డ్రైవర్లు సమ్మెకు దిగారు.

మంగళవారం నాటికి సమ్మె ప్రభావందేశమంతటా విస్తరించింది. పెట్రోల్, డీజిల్‌ కోసం వాహనదారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కడంతో అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో కేంద్రం దిగొచ్చి చర్చలు జరిపింది.

హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన కొత్త చట్టాలను తమ సభ్యులతో చర్చించిన తర్వాత అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ట్రక్కు డ్రైవర్లు తమ సమ్మెను విరమించుకోవాలని ఆల్ ఇండియా మోటర్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (AIMTC) ప్రతినిధులు ప్రకటించారు.

మంగళవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో జరిగిన సమావేశం తర్వాత సమస్య పరిష్కారమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

హిట్ అండ్ రన్ కేసులపై 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు రూ. 7 లక్షల జరిమానాను ప్రతిపాదించే కొత్త చట్టంపై చర్చించేందుకు AIMTC ప్రతినిధులు సాయంత్రం కేంద్ర హోం కార్యదర్శిని కలిశారు.సమ్మె కారణంగా పశ్చిమ మరియు ఉత్తర భారతదేశంలోని దాదాపు 2,000 పెట్రోల్ పంపుల్లో ఇంధన నిల్వలు అయిపోయాయి.

హోంశాఖ కార్యదర్శితో సమావేశం అనంతరం ఏఐఎంటీసీ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడుతూ కొత్త చట్టాలను అమలు చేసేందుకు అనుమతించబోమని చెప్పారు."యే కానూన్ అభి తక్ లాగూ నహీ హై (ఈ చట్టం ఇంకా అమలు కాలేదు) ... హామ్ యే కానూన్ లాగు నహీ హోనే దేంగే (ఈ చట్టాలను అమలు చేయడానికి మేము అనుమతించము)," AIMTC ఛైర్మన్-ఆర్గనైజింగ్ కమిటీ బాల్ మన్కిత్ సింగ్ చెప్పారు. ఆందోళన విరమించాలని ట్రక్కర్లను సింగ్ కోరారు.

తదుపరి వ్యాసం