తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sovereign Gold Bond : సావరీన్ గోల్డ్ బాండ్‌ 2022-23 సిరీస్ 1 లో చేరతారా?

Sovereign gold bond : సావరీన్ గోల్డ్ బాండ్‌ 2022-23 సిరీస్ 1 లో చేరతారా?

20 June 2022, 14:17 IST

    • సావరీన్ గోల్డ్ బాండ్స్‌లో చేరడానికి మరో అవకాశం లభించింది.
ఫిజికల్ గోల్డ్ కంటే సేఫ్ సావరిన్ గోల్డ్ బాండ్స్
ఫిజికల్ గోల్డ్ కంటే సేఫ్ సావరిన్ గోల్డ్ బాండ్స్ (AFP)

ఫిజికల్ గోల్డ్ కంటే సేఫ్ సావరిన్ గోల్డ్ బాండ్స్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ స్కీమ్)లో చేరేందుకు మొదటి విడతగా ఓపెన్ అయ్యింది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Fact Check: రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే.అడ్వాణీ ఈ వ్యాఖ్యలు చేయలేదు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

దీనిలో భాగంగా ఇష్యూ ప్రైస్‌ను గ్రామ్‌కు రూ. 5,091గా నిర్దేశించారు. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2022-23 సిరీస్ 1 జూన్ 24 వరకూ ఓపెన్ అయి ఉంటుంది.

ఈ స్కీమ్‌లో చేరేందుకు ఆన్‌లైన్ ద్వారా చేరితే గ్రాముకు రూ. 50 చొప్పున అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే ఆన్‌లైన్ ఇన్వెస్టర్లకు గ్రాముకు రూ. 5,041 ధర వర్తిస్తుంది.

సావరిన్ గోల్డ్ బాండ్ జూన్ 28న జారీ అవుతుంది. కాగా గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పది గ్రాములకు రూ. 50,866 వద్ద ట్రేడవుతోంది.

ఇక 2022-23లో రెండో సిరీస్ గోల్డ్ సావరిన్ బాండ్స్ తిరిగి ఆగస్టు 22-26 మధ్య ఓపెన్ అవుతుంది.

గోల్డ్ సావరిన్ బాండ్స్ గురించి 10 పాయింట్లు..

  1. సావరిన్ గోల్డ్ బాండ్స్ 8 ఏళ్లకు మెచ్యూర్ అవుతాయి. లేదా ఐదో ఏడుద తరువాత ప్రిమెచ్యూర్ రీడెంప్షన్ చేసుకోవచ్చు.

2. ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్‌పై 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ చెల్లిస్తారు.

3. కనీసం 1 గ్రాము బంగారంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కేంద్రం ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ ఈ బాండ్స్ జారీచేస్తుంది.

4. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ తొలుత 2015లో లాంచ్ చేశారు. ఫిజికల్ గోల్డ్‌కు గల డిమాండ్‌ను తగ్గించి, దేశీయంగా పొదుపు పెంచే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

5. 2021-22, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లోఇన్వెస్టర్లు రూ. 29,040 కోట్ల విలువైన బాండ్లలో పెట్టుబడులు పెట్టారు.

6. డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఇక్కడ స్టోరేజీ వ్యయం అవసరం ఉండదు. పైగా దీనిపై వార్షిక వడ్డీ లభిస్తుంది.

7. ఏప్రిల్‌లో భారీగా పెరిగిన బంగారం క్రమంగా కిందికి దిగి వచ్చింది. యూఎస్ డాలర్ బలపడడం వల్ల బంగారం ధర పడుతూ వచ్చింది. అయితే ద్రవ్యోల్భణంలో మరింత పెరుగుదల, వడ్డీ రేట్ల పెరుగుదల వంటి కారణాలు బంగారం లాభాలను పరిమితం చేస్తుదని అంచనా వేస్తున్నారు. అనిశ్చితి ఉన్న పరిస్థితుల్లో సంప్రదాయంగా బంగారం విలువ మరింత పెరుగుతుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం, కోవిడ్ కొత్త వేరియంట్లు బంగారం ధరను మరింత పెంచే అవకాశం ఉంది.

8. గోల్డ్ సావరిన్ బాండ్లను ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఎంతైనా లిక్విడిటీ మాత్రం స్వల్పమే.

9. మెచ్యూరిటీ అనంతరం లభించే కాపిటల్ గెయిన్స్‌పై ఎలాంటి పన్నూ ఉండదు. గోల్డ్ బాండ్స్‌పై లభించే ప్రత్యేక ప్రయోజనం ఇది.

10. అయితే సావరిన్ గోల్డ్ బాండ్ సెకెండరీ సేల్ ఇన్‌కమ్‌టాక్స్ పరిధిలోకి వస్తుంది. కాగా ఈ ఎస్‌జీబీని కొలాటరల్ సెక్యూరిటీ కింద పెట్టి లోన్స్ తీసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం