తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sovereign Gold Bonds (Sgbs) | సావరీన్ గోల్డ్ బాండ్స్‌ ఎలా కొనాలి? ప్రయోజనం ఏంటి?

Sovereign Gold Bonds (SGBs) | సావరీన్ గోల్డ్ బాండ్స్‌ ఎలా కొనాలి? ప్రయోజనం ఏంటి?

23 February 2022, 14:11 IST

  • Sovereign Gold Bonds (SGBs) | బంగారం కొనుగోలుకు ఉత్తమ ప్రత్యామ్నాయ విధానం ఈ సావరీన్ గోల్డ్ బాండ్స్. అంటే బంగారం ఫిజికల్ రూపంలో కాకుండా డాక్యుమెంట్ రూపంలో, ఒక బాండ్ రూపంలో మీరు దాచుకోవచ్చు. అసలు బంగారం కంటే కూడా అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

బంగారం కొనుగోలు కంటే గోల్డ్ బాండ్లలో పెట్టుబడి మేలు
బంగారం కొనుగోలు కంటే గోల్డ్ బాండ్లలో పెట్టుబడి మేలు (unsplash)

బంగారం కొనుగోలు కంటే గోల్డ్ బాండ్లలో పెట్టుబడి మేలు

సావరీన్ గోల్డ్ బాండ్స్ ప్రయోజనాలు

సావరీన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేస్తే బంగారం కొనుగోలు చేసిన దాని కంటే ఎక్కువ లాభమనే చెప్పొచ్చు. 

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : ఇలాంటివారు జీవితాంతం దు:ఖంలోనే ఉంటారు మరి

Sweetcorn Dosa: స్వీట్ కార్న్ దోశ రెసిపీ, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

1. బంగారం ధర పెరిగినట్టే బాండ్ విలువ పెరుగుతూ ఉంటుంది. 

2. అలాగే వడ్డీకి వడ్డీ కూడా వస్తుంది. 2.5 శాతం వడ్డీ రేటుతో ఏటా వడ్డీ ఆదాయం పొందవచ్చు. 

3. మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తే కాపిటల్ గెయిన్స్ టాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. 

4. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే బాండ్లు కావడంతో మీ అసలు సొమ్ముకు ఎలాంటి ఢోకా ఉండదు. 

5. ఫిజికల్‌గా బంగారం కొంటే ఉండే దొంగల భయం కూడా ఉండదు. లాకర్‌లో పెట్టేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది. 

6. ఎక్స్ఛేంజీలలో బాండ్లు అమ్ముకోవచ్చు. బదిలీ కూడా చేసుకోవచ్చు.

సావరీన్ గోల్డ్ బాండ్స్ ఎలా కొనుగోలు చేయాలి?

ఒక్కొక్కరు 4 కిలోల బంగారానికి సమానంగా బాండ్లు తీసుకోవచ్చు. ట్రస్టులు, ఇతర సంస్థలైతే 20 కిలోల బంగారానికి సమానంగా బాండ్లు తీసుకోవచ్చు. బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ కొనుగోలు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అలాగే ఆయా బ్యాంకుల యాప్‌ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. 

ఒక గ్రాము నుంచి మొదలుకుని కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ. 50 చొప్పున డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బాండ్లను డీమాట్ ఖాతాలో కూడా పొందుపరుచుకోవచ్చు. కొనుగోలు సమయంలో డీమాట్ డీపీ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది. 

బాండ్ కొనుగోలు చేయగానే హోల్డింగ్ సర్టిఫికెట్ మీ ఈమెయిల్ ఐడీకి వస్తుంది. బాండు మెచ్యూరిటీ 8 సంవత్సరాలు. ఐదు సంవత్సరాలు వచ్చాక బాండ్ నుంచి వైదొలిగే అవకాశం ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్దేశించిన రిడెంప్షన్ ధర ప్రకారం చెల్లిస్తారు.

2015లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ స్కీమ్‌ను అనుసరించి ఇప్పటివరకు 9 సార్లు సావరీన్ గోల్డ్ బాండ్స్ సబ్‌స్క్రిప్షన్‌కు అనుమతి ఇచ్చారు. పదో సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

బంగారం ధర తగ్గితే తప్ప.. మీ బాండు విలువ తగ్గదు. అందువల్ల బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు సావరీన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన విధానం అని చెప్పొచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం