తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sonia Gandhi: వైద్య పరీక్షల కోసం విదేశాలకు సోనియా గాంధీ

Sonia Gandhi: వైద్య పరీక్షల కోసం విదేశాలకు సోనియా గాంధీ

HT Telugu Desk HT Telugu

24 August 2022, 9:52 IST

    • Sonia Gandhi: వైద్య పరీక్షల కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు విదేశాలకు వెళుతున్నట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి.
సోనియా గాంధీ
సోనియా గాంధీ (HT_PRINT)

సోనియా గాంధీ

న్యూఢిల్లీ, ఆగస్టు 24: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల నిమిత్తం ఈరోజు విదేశాలకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ బుధవారం తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆమె వెంట వెళుతున్నట్టు తెలిపారు. ఇటీవల సోనియా గాంధీ రెండుమార్లు కోవిడ్ బారిన పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నారు. పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ సెప్టెంబర్ 4న ఢిల్లీలో 'ధరల పెరుగుదలపై ఆందోళన' ర్యాలీలో ప్రసంగిస్తారు’ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబర్ 4న ఢిల్లీలో జరిగే 'ధరల పెరగుదలపై ఆందోళన' ర్యాలీలో పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. తదుపరి భారత్ జోడో ర్యాలీకి పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

అంతకుముందు మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కొత్తగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశమయ్యారు.

ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల కారణంగా పలువురు నేతల పార్టీని విడిచివెళుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.

టాపిక్

తదుపరి వ్యాసం